ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజాంలో మరో కొవిడ్‌ ఆసుపత్రి

ABN, First Publish Date - 2021-05-10T04:31:00+05:30

రాజాంలో మరో కొవిడ్‌ ఆసుపత్రికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సెయింటాన్స్‌ హాస్పటల్‌ను కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్‌ నివాస్‌ ఆదేశాల మేరకు పాలకొండ ఆర్డీవో కుమార్‌ ఆసుపత్రి యాజమాన్యంతో చర్చించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజాం రూరల్‌: రాజాంలో మరో కొవిడ్‌ ఆసుపత్రికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సెయింటాన్స్‌ హాస్పటల్‌ను కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్‌ నివాస్‌ ఆదేశాల మేరకు పాలకొండ ఆర్డీవో కుమార్‌ ఆసుపత్రి యాజమాన్యంతో చర్చించారు. ఇప్పటి వరకు సామాజిక ఆసుపత్రి, అమృత, జీఎంఆర్‌ కేర్‌ ఆసుపత్రిల్లో కొవిడ్‌ సేవలు అందిస్తున్నారు. సెయింటాన్స్‌లో కొవిడ్‌ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఇన్‌చార్జి తహసీల్దార్‌ రంజిత్‌ ధ్రువీకరించారు. అలాగే పట్టణంతో పాటు గ్రామాల్లోని పలు ప్రాంతాల్లో కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. గురవాం లోని కేజీబీవీ వసతి గృహంతో పాటు రాజాంలోని మూడు వసతి గృహాలను ఎంపిక చేశారు. వీటిలో ప్రత్యేక గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం ఉండడంతో కొవిడ్‌ రోగులకు అనుకూలంగా ఉంటుందన్న ఆలోచనతో వీటిని అధికారులు ప్రతిపాదిం చారు. ఈ సెంటర్లకు సంబంధించి జాబితాను ఉన్నతాధికారులకు పంపామని ఇన్‌చార్జి తహసీల్దార్‌ పేర్కొన్నారు. 

 


Updated Date - 2021-05-10T04:31:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising