ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో 568

ABN, First Publish Date - 2021-04-16T05:35:38+05:30

జిల్లాలో ఇరవై నాలుగు గంటల వ్యవధిలో గురువారం మరో 568 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకీ కరోనా ఉధృతి పెరుగుతోంది. అధికారులు, పోలీసులు హెచ్చరి స్తున్నా.. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించడం లేదు. చాలా మంది మాస్క్‌లు ధరించకుండా ప్రయాణాలు సాగిస్తూనే ఉన్నారు. హోటళ్లు, మాం సం దుకాణాల వద్ద భౌతిక దూరాన్ని విస్మరి స్తున్నారు. దీంతో కరోనా కేసుల సంఖ్య పెరిగి పోతోంది.

ఎల్‌.ఎన్‌.పేట మండలంలో కరోనా పరీక్షలు చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జిల్లాలో నమోదైన పాజిటివ్‌ కేసులు

 పెరుగుతున్న కొవిడ్‌ ఉధృతి

 పది లక్షలకు చేరువలో పరీక్షలు

 అందుబాటులో లేని వ్యాక్సిన్లు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఏప్రిల్‌ 15)

జిల్లాలో ఇరవై నాలుగు గంటల వ్యవధిలో గురువారం మరో 568 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకీ  కరోనా ఉధృతి పెరుగుతోంది. అధికారులు, పోలీసులు హెచ్చరి స్తున్నా.. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించడం లేదు. చాలా మంది మాస్క్‌లు ధరించకుండా ప్రయాణాలు సాగిస్తూనే ఉన్నారు. హోటళ్లు, మాం సం దుకాణాల వద్ద భౌతిక దూరాన్ని విస్మరి స్తున్నారు. దీంతో కరోనా కేసుల సంఖ్య పెరిగి పోతోంది. జిల్లాలో  గత ఏడాది ఏప్రిల్‌ 22న కరోనా తొలికేసు నమోదైంది. ఆతర్వాత ఒకటీ.. మూడు.. అలా నమోదై... జూన్‌ నుంచి అక్టోబర్‌ మాసం వరకు కేసులు సంఖ్య భారీగా పెరిగిపోయాయి. దీంతో టెస్టుల సంఖ్య రోజువారీగా మూడు వేల నుంచి 5వేల సంఖ్యలో చేసేవారు. ప్రస్తుతం సుమారు మూడువేల మంది నుంచి నమూనాలు సేకరిస్తు న్నారు. ఇప్పటివరకు 9,95,278 మందికి కరోనా పరీక్షలు చేశారు. మరో రెండు రోజుల్లో పరీక్షల సంఖ్య పదిలక్షలకు చేరుకోనుంది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు జిల్లాలో 49,974 మంది  కరోనా భారిన పడ్డారు. ఇప్పటివరకు 351 మంది కరోనాతో పోరాడి.. పరిస్థితి విషమించి మృతిచెం దారు. చాలా మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ప్రస్తుతం హోం ఐసోలేషన్‌ కేంద్రంలో 2,348 మంది, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 252 మంది, కొవిడ్‌ ఆస్పత్రుల్లో 121మంది చికిత్స పొందుతు న్నారు. గతంలో హోం ఐసోలేషన్‌లో ఉన్నవారిపై ఆంక్షలు ఉండేవి. వలంటీరు నుంచి ఏఎన్‌ఎం, ఆపై సచివా లయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరిశీలించే వారు. కరోనా బాధితుడు నిబంధనలు పాటిస్తున్నారా? లేదోనని తెలుసుకునే వారు. ఆరోగ్య పరిస్థితి  ఆరాతీసే వారు. ఇప్పుడా పరిస్థితి లేదు. హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులను పరిశీలించే నాథులు లేరు. పైగా ఆ ప్రాంతాల్లో కంటైన్మెంట్‌ జోన్లు  కూడా ఏర్పాటు చేయడం లేదు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల రోడ్లపైన, వార్డుల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు. 


వ్యాక్సిన్ల కోసం ఎదురుచూపు


జిల్లాలో కరోనా కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభ మైనా ఆశించినస్థాయిలో ముందుకు సాగడం లేదు. ముందుగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి వ్యాక్సి న్లు వేశారు. తరువాత ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అయిన పారి శుధ్య కార్మికులు, పోలీసులు, పంచాయతీరాజ్‌ శాఖ, రెవె న్యూ సిబ్బందికి వేస్తున్నారు. తాజాగా టీకా ఉత్సవ్‌ ప్రారం భించినా.. వ్యాక్సిన్ల కొరత కారణంగా సజావుగా సాగడం లేదు. 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవా లని, సచివాలయాల్లో టీకా వేస్తున్న దృష్ట్యా సద్వి నియోగం చేసుకోవాలని అధికారులు అవగాహన కల్పిస్తు న్నారు. కానీ వ్యాక్సిన్‌ డోసులు ఎక్కడికక్కడే నిండుకు న్నాయి. జిల్లాకు రెండోవిడత చేరుకున్న కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలు ఒక్కరోజు లోనే అయిపోయాయి. నిల్వలు వస్తే కానీ ప్రక్రియ సజా వుగా ముందుకు సాగే పరిస్థితులు కనిపించడం లేదు. జిల్లాలో లక్షలాది మంది ప్రజలు వ్యాక్సి న్ల కోసం రిజిస్ర్టేషన్‌ చేసుకున్నారు. గురువా రం కూడా జిల్లావైద్యఆరోగ్యశాఖ కార్యాలయానికి టీకా నిల్వలు  చేరుకోలేదు. శుక్రవారం కూడా టీకా లు సరఫరా అయ్యే పరిస్థితి లేదని విశ్వసనీయ సమా చారం. మొదటి టీకా డోసు తీసుకున్న వారికి 28 రోజుల తర్వాత రెండో డోసు టీకా వేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం టీకా నిల్వలు లేకపోవడంతో రెండోడోసు ఎప్పుడు వేస్తార న్నది స్పష్టత లేదు. సకాలంలో టీకాలు వేసుకోకపోతే.. కరోనా ఎదుర్కొనే సామర్థ్యం ఉండదని గతంలో వైద్య సిబ్బంది ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లాకు టీకాలు తెప్పించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.  


కరోనా లక్షణాలతో భార్యాభర్తలు మృతి


హరిపురం: మందస మండ లంలోని ఉద్దానం ప్రాంతంలో  ఓ గ్రామానికి చెందిన భార్యాభర్తలు కరోనా లక్షణాలతో మృతి చెందినట్లు తహసీల్దార్‌ బి.పాపారావు గురువారం తెలిపారు. భర్త (45) ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనోపాధి పొందుతున్నట్లు చెప్పారు. భార్యభర్తలిద్దరు కరోనా బారిన పడడంతో విశాఖలో చికిత్సపొందుతూ ఒక రోజు వ్యవధిలో మృతిచెందారని తెలిపారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Updated Date - 2021-04-16T05:35:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising