ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్యాస్‌ బాదుడు!

ABN, First Publish Date - 2021-08-18T05:39:07+05:30

గ్యాస్‌ వినియోగదారులపై మరోసారి భారం పడింది. సిలిండర్‌పై రూ.25 ధర పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.891కు చేరుకుంది. గత కొద్ది నెలలుగా గ్యాస్‌ ధరలు అమాంతం పెరుగుతూ వస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




సిలిండర్‌పై రూ.25 పెంపు

వినియోగదారులపై భారం

(సోంపేట)

గ్యాస్‌ వినియోగదారులపై మరోసారి భారం పడింది. సిలిండర్‌పై రూ.25 ధర పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.891కు చేరుకుంది. గత కొద్ది నెలలుగా గ్యాస్‌ ధరలు అమాంతం పెరుగుతూ వస్తున్నాయి. ఆగస్టు 1న పెంపు ప్రకటన రానప్పటికీ...ఈ నెల 16న ధర పెంచినట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం సైతం రాయితీని తగ్గించింది. కేవలం రూ.15 మాత్రమే అందిస్తోంది. దీంతో వినియోగదారులపై భారం పడుతోంది. కరోనా విపత్తు కాలంలో ధర పెంపుతో ఆందోళనకు గురవుతున్నారు. 19 కిలోల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌పై ఎటువంటి ధర పెంపు లేకపోవడం వినియోగదారులకు కాస్త ఉపశమనం. జిల్లాలో ఇండియన్‌, హెచ్‌పీ, భారత్‌ గ్యాస్‌ వినియోగదారులు 8 లక్షల మంది వరకూ ఉన్నారు. ఇటీవల గ్యాస్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. చెట్ల సంరక్షణలో భాగంగా పటిష్ట చర్యలు చేపట్టడంతో వంట చెరకు వినియోగాన్ని తగ్గించారు. గ్యాస్‌ కంపెనీలు రాయితీలు ప్రకటించడంతో ఎక్కువ మంది గ్యాస్‌ వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చమురు సంస్థలు రకరకాల కారణాలు చూపుతూ ధర పెంచుతున్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం రాయితీ ఎక్కువగా అందించేది. క్రమేపీ రాయితీ తగ్గించడంతో కూడా వినియోగదారుడిపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పెట్రోల్‌ ధర రూ.110కి చేరుకోగా..నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ పరిస్థితుల్లో గ్యాస్‌ ధర రూ.1,000కు చేరువవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సామాన్య, మధ్యతరగతి వారు ఆపసోపాలు పడుతున్నారు. 

Updated Date - 2021-08-18T05:39:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising