ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబేడ్కర్‌ వర్సిటీ వీసీగా వెంకటరావు

ABN, First Publish Date - 2021-01-19T05:49:23+05:30

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌గా ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం జీవో విడుదల చేసింది. గత ఏడాది డిసెంబరు 7వ తేదీతో వీసీ ప్రొఫెసర్‌ కూన రాంజీ మూడేళ్ల పదవీ కాలం ముగిసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇన్‌ఛార్జి వీసీగా రాష్ట్ర ఉన్నత విద్య ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్ర వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంకటరావును వీసీగా నియమించింది.

ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎచ్చెర్ల, జనవరి 18: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌గా ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం జీవో విడుదల చేసింది. గత ఏడాది డిసెంబరు 7వ తేదీతో వీసీ ప్రొఫెసర్‌ కూన రాంజీ మూడేళ్ల పదవీ కాలం ముగిసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇన్‌ఛార్జి వీసీగా రాష్ట్ర ఉన్నత విద్య ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్ర వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంకటరావును  వీసీగా నియమించింది. వెంకటరావుది ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామం. ఆంధ్రా యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసి 2019 సెప్టెంబరు 30న పదవీ విరమణ చేశారు. ఆంధ్రాయూనివర్సిటీ పరిధిలోని హైస్కూల్‌లో సోషల్‌ స్టడీస్‌ టీచర్‌గా తొలుత కెరీర్‌ ప్రారంభించారు. అనంతరం ఏయూలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా, ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2012-14 వరకు వరుసగా ఎడ్‌సెట్‌ కన్వీనర్‌గా వ్యవహరించారు. ఏయూలో ఎడ్యుకేషన్‌ విభాగాధిపతిగా, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ ఛైర్మన్‌గా, సీడీసీ డీన్‌గా, అడ్మిషన్ల డైరెక్టర్‌గా సేవలందించారు. ఇటీవల ప్రభుత్వం నియమించిన ఫీజుల నియంత్రణ కమిటీలో సభ్యునిగా  ఉన్నారు. ప్రస్తుతం అంబేడ్కర్‌ యూనివర్సిటీ ఎడ్యుకేషన్‌ విభాగానికి బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈయన సతీమణి కూడా ప్రభుత్వ ఉపాఽధ్యాయురాలే. ప్రొఫెసర్‌ వెంకటరావు ఒకటి రెండు రోజుల్లో వీసీగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. 


Updated Date - 2021-01-19T05:49:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising