ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబరాన ఉగాది సంబరం

ABN, First Publish Date - 2021-04-14T04:59:20+05:30

ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు మంగళవారం వాడవాడలా ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునుంచే పవిత్ర స్నానాలు ఆచరించి నూతన వస్త్రాలు ధరించి కుటుంబమంతా ప్రత్యేక పూజలు చేశారు. షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తిని ఆనందం పొందారు.

పంచాంగ శ్రవణాన్ని చేస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నూతన వస్త్రాలతో చిన్నారుల సందడి  

 గ్రామాల్లో పంచాంగ శ్రవణాలు

 ‘ఏరువాక’  చేపట్టిన రైతన్నలు 

 భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు

 వ్యవసాయ క్షేత్రాలు సందర్శించిన అన్నదాత కుటుంబ సభ్యులు 

(ఆంధ్రజ్యోతి బృందం) : ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు మంగళవారం వాడవాడలా ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునుంచే పవిత్ర స్నానాలు ఆచరించి నూతన వస్త్రాలు ధరించి కుటుంబమంతా ప్రత్యేక పూజలు చేశారు. షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తిని ఆనందం పొందారు. గ్రామ పురోహితుల సూచనల మేరకు రైతులు ఏరువాక చేపట్టి నూతన పంట సాగుకు శ్రీకారం చుట్టారు. అలాగే రైతుల కుటుంబ సభ్యులు వారి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. దేవాలయాలు, గ్రామ కూడళ్లలో పురోహితులు నూతన పంచాంగ శ్రవణాన్ని చేశారు. గ్రామాల్లోని దేవాలయాలకు గ్రామస్థులు కుటుంబ సభ్యులతో వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులు నూతన వస్త్రాలు ధరించి తెలుగు వత్సరానికి స్వాగతం పలికారు. పట్టణ ప్రాంతాల్లో కవి సమ్మేళనాలు, నూతన వాహనాలు, బంగారు వస్తువుల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి కనబరిచారు.  

 

Updated Date - 2021-04-14T04:59:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising