ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వినాశనానికి చిరునామా వైసీపీ

ABN, First Publish Date - 2021-07-23T05:44:10+05:30

వినాశనానికి వైసీపీ ప్రభుత్వం కేరాఫ్‌ అడ్రాస్‌గా మారిందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళావెంకట రావు విమర్శించారు.

వంగర మండల నాయకులతో మాట్లాడుతున్న కళా వెంకటరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కళా వెంకటరావు

జి.సిగడాం, జూలై 22: వినాశనానికి వైసీపీ ప్రభుత్వం కేరాఫ్‌ అడ్రాస్‌గా మారిందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళావెంకట రావు విమర్శించారు. గురువారం ఆయన మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. బాతువ, గెడ్డకంచరాం, ఎందువ, నడిమివలసల్లోని కరోనా బాధితులు,  కొవిడ్‌ మృతుల కుటుంబాలు, వివిధ ప్రమాదాల క్షతగాత్రులను ఆయన పరా మర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి గాడి తప్పిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తెస్తామన్న జగన్‌రెడ్డి..  తీరా గెలిచాక మోదీ మోకాళ్ల దగ్గర భజన చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతు న్న వారిపై పిడుగుద్దులు కురు పిస్తున్నారిని దుయ్యబట్టారు. నారాయణపురం ఆధునికీకరణ పనులకు కేటా యించిన జైకా నిధులను ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడం వలనే సాగునీటికి అన్నదాతలకు ఇబ్బందులు ఏర్పడ్డాయని ఆయన ఆరో పించారు.  పిచ్చితుగ్లక్‌కు ఓట్లువేసి తప్పుచేశామని ప్రజలు కుంగిపోతున్నారని, వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేరోజులు దగ్గర పడ్డాయని అన్నారు. మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమావ్యక్తం చేశారు. కళా వెంట నాయకులు కుమరాపు రవికుమార్‌, బెవర జగన్నాథరావు, మక్క నారాయణరావు, భూపతి శ్రీరామూర్తి, ముసిలినాయుడు, తదితరలు ఉన్నారు. రాజాం:  కళావెంక టరావును  గురువారం వంగర మండలం సంగాం గ్రామ నాయకులు సంగంన్నా యుడు తదితరులు కలిశారు. గ్రామ సమస్య లను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.


 



Updated Date - 2021-07-23T05:44:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising