ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు

ABN, First Publish Date - 2021-10-26T04:54:29+05:30

రెవెన్యూ, గ్రామ సచివాలయ సిబ్బంది పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని పాలకొండ ఆర్డీవో పీవీఎస్‌జీ కుమార్‌ హెచ్చరించారు. రెవెన్యూ కార్యాలయంలో సోమవారం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.

మాట్లాడుతున్న పాలకొండ ఆర్డీవో కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 పాలకొండ ఆర్డీవో కుమార్‌

సారవకోట (జలుమూరు), అక్టోబరు 25: రెవెన్యూ, గ్రామ సచివాలయ సిబ్బంది పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని పాలకొండ ఆర్డీవో పీవీఎస్‌జీ కుమార్‌ హెచ్చరించారు. రెవెన్యూ కార్యాలయంలో సోమవారం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీసేవలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత సిబ్బంది పరిష్కరించడంలేదని, తక్షణం వాటిని పరిష్కరించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 22 పిర్యాదులు పెండింగ్‌లో ఉండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. రామకృష్ణాపురం గ్రామ సచివాలయ సర్వేయర్‌ భీమారావు పనితీరు బాగులేనందున సరెండర్‌ చేయాలని ఆదేశించారు. ఉద్యోగులంతా బాధ్యతతో పనిచేయాలని, లేకుంటే సెలవుపై వెళ్లాలన్నారు. తహసీల్దార్‌ రాజమోహనరావు, డీటీ సరిత, సర్వేయర్‌ కృష్ణారావు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-10-26T04:54:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising