భూ సర్వే వేగవంతం చేయండి
ABN, First Publish Date - 2021-08-17T05:37:51+05:30
భూ సమగ్ర సర్వే పారదర్శకంగా చేపట్టి వేగవంతం చేయాలని స్పెషల్ డిప్యూ టీ కలెక్టర్ టి.సీతారామ్మూర్తి ఆదేశించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సోమవారం సర్వేయర్ల తో సమావేశమయ్యారు. రెవెన్యూ పాత రికార్డులు ఎస్.ఎల్.ఆర్, వెబ్‌లాండ్ తదితర రికార్డులు ఆధారంగా భూమి యజమానులను గుర్తించి రికార్డులు తయారు చేయాలన్నారు.
జలుమూరు: భూ సమగ్ర సర్వే పారదర్శకంగా చేపట్టి వేగవంతం చేయాలని స్పెషల్ డిప్యూ టీ కలెక్టర్ టి.సీతారామ్మూర్తి ఆదేశించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సోమవారం సర్వేయర్ల తో సమావేశమయ్యారు. రెవెన్యూ పాత రికార్డులు ఎస్.ఎల్.ఆర్, వెబ్‌లాండ్ తదితర రికార్డులు ఆధారంగా భూమి యజమానులను గుర్తించి రికార్డులు తయారు చేయాలన్నారు. డ్రోన్ సర్వేలో ప్రభుత్వ పోరంబోకు, చెరువులు, కాలువలు, గుర్తించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 58 గ్రామాలను గుర్తించి 13 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేశామన్నారు. సమావేశంలో తహసీల్దార్ జామి ఈశ్వరమ్మ, సర్వేయర్ చిన్నప్పన్న తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-08-17T05:37:51+05:30 IST