ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడలతో ఉజ్వల భవిషత్

ABN, First Publish Date - 2021-01-25T05:16:20+05:30

క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌ ఉం టుందని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే డాక్టర్‌ బెం దాళం అశోక్‌ తెలి పారు. ఆదివారం ప్రగడపుట్టుగలో అంతర్రాష్ట్ర వాలీబాల్‌ పోటీలకు సంబంధిం చి కోర్టులను ప్రారంభిం చారు.

ప్రగడపుట్టుగలో వాలీబాల్‌ కోర్టుకు పూజలు చేస్తున్న ఎమ్మెల్యే అశోక్
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ఎమ్మెల్యే బెందాళం అశోక్‌

కవిటి: క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌ ఉం టుందని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే డాక్టర్‌ బెం దాళం అశోక్‌  తెలి పారు. ఆదివారం  ప్రగడపుట్టుగలో  అంతర్రాష్ట్ర వాలీబాల్‌ పోటీలకు సంబంధిం చి కోర్టులను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్దానం ప్రాంతంలో ప్రతిభ గల క్రీడా కారులకు కొదవలేదని, క్రీడలతో ఉన్నత స్థానాలకు చేరు కోవ చ్చని తెలిపారు.విద్యతోపాటు క్రీడలను నిరంతర సాధన చేయాలన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తాచాటే క్రీడాకారులు ఉద్దానం ప్రాంతంలో ఉన్నారని  తెలిపా రు. కార్యక్రమంలో కిషన్‌ బాబు పాల్గొన్నారు. 


క్రికెట్‌ విజేత మఖరాంపురం

కంచిలి: మఖరాంపురంలో విశ్వశాంతి క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్‌ పోటీల్లో మఖరాంపురం జట్టు విజేతగా నిలిచింది. ఇచ్ఛాపురం, మఖరాంపురం జట్ల మధ్య ఆదివారం జరిగిన పోటీలో టాస్‌ గెలిచి ముందుగా మఖరాంపురం జట్టు   బ్యాటింగ్‌ చేసింది. నిర్ణీత 25 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 221 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఇచ్ఛాపురం జట్టు 21.1 ఓవర్లలో 152 పరుగులు మాత్రమే చేసింది. దీంతో మఖరాంపురం జట్టు 69 పరుగులు తేడాతో విజేతగా నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు. మఖరాంపురం జట్టులో వి.ప్రవీణ్‌ 61, ఇచ్ఛాపురం జట్టులో లావణ్‌ 80 పరుగులు చేశారు. మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా ఎస్‌.శివ, మ్యాన్‌ ఆఫ్‌ద సిరిస్‌గా వి.ప్రవీణ్‌, బెస్ట్‌ బౌలర్‌గా అజయ్‌కుమార్‌, బ్యాట్స్‌ మెన్‌గా లావణ్‌, కీపర్‌గా నారాయణ  ఎంపికైనట్లు నిర్వాహ కులు తెలిపారు. విజేతలకు  జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తమ్మినేని చిరంజీవి నాగ్‌, డిప్యూటీ కలెక్టర్‌ తమరాల సీతారామమూర్తి, టీవీ రమణ  నగదు పారితోషికంతోపాటు షీల్డ్‌లు అందజేశారు.

  ఇచ్ఛాపురం రూరల్‌: సన్యాసిపుట్టుగలో యువజన సంఘం, గ్రామపెద్దల ఆధ్వర్యంలో శ్రీభూలోకమాత కబడ్డీ పోటీలు ఆదివారం  ప్రారంభించారు. ఈ టోర్నీలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి 40 జట్లు పాల్గొన్నాయి. సోమ, మంగళవారం వరకు పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. మ్యాచ్‌ రిఫరీలుగా సప్ప చిరంజీవి, ఎండీ నజీర్‌ అహ్మద్‌, సహజన్‌ మదీనా, జోగారావు వ్యవహరిస్తున్నారు.


క్రీడలపై ఆసక్తి చూపాలి

ఎచ్చెర్ల: విద్యార్థులు క్రీడలపై ఆసక్తి చూపాలని రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ) ఓఎస్‌డీ ప్రొఫెసర్‌ ఎల్‌డీ సుధాకర్‌ బాబు అ న్నారు. శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ విద్యార్థులకు ఓఎస్‌డీ తన సొంత నిధులతో క్రీడాపరికరాలను పంపిణీ చేశారు.  కార్యక్రమంలో ఫిజికల్‌ డైరెక్టర్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-01-25T05:16:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising