ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

108 వాహనం రాకపోవడంతో... ఆగిన ఊపిరి!

ABN, First Publish Date - 2021-05-10T04:45:28+05:30

సకాలంలో 108 వాహనం రాకపోవడంతో ఇంటి వద్దే ఓ మహిళ ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన పొందూరులో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పొందూరులోని నాయుడువీధికి చెందిన ఆదిలక్ష్మి(56)కి శ్వాస అందకపోవడంతో శనివారం రాత్రి అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు 108 వాహనం కోసం రాత్రి 11 గంటల సమయంలో ఫోన్‌ చేశారు. కానీ వారు స్పందించలేదు. సుమారు అరగంట పాటు వాహనం కోసం వేచిచూడగా, ఆమె పరిస్థితి మరింత క్షీణించింది. కుటుంబ సభ్యుల కళ్లెదుటే ఆమె ప్రాణం విడిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఫోన్‌ చేసినా స్పందించని సిబ్బంది

- డీజిల్‌ లేదంటూ నిర్లక్ష్యం

- సకాలంలో ఆక్సిజన్‌ అందక మహిళ మృతి

- పొందూరులో ఘటన

పొందూరు, మే 9 : సకాలంలో 108 వాహనం రాకపోవడంతో ఇంటి వద్దే ఓ మహిళ ప్రాణాలు విడిచింది.  ఈ విషాద ఘటన పొందూరులో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పొందూరులోని నాయుడువీధికి చెందిన ఆదిలక్ష్మి(56)కి శ్వాస అందకపోవడంతో శనివారం రాత్రి అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు 108 వాహనం కోసం రాత్రి 11 గంటల సమయంలో ఫోన్‌ చేశారు. కానీ వారు స్పందించలేదు. దీంతో వీఆర్వోను సంప్రదించగా, ఆయన తహసీల్దార్‌ కార్యాలయంలోని వాహన సిబ్బందికి ఫోన్‌ చేశారు. డీజిల్‌ లేదని.. తాము రాలేమని వారు సమధానమిచ్చారు. సుమారు అరగంట పాటు వాహనం కోసం వేచిచూడగా, ఆమె పరిస్థితి మరింత క్షీణించింది. కుటుంబ సభ్యుల కళ్లెదుటే ఆమె ప్రాణం విడిచింది. ప్రస్తుతం ఆమె ఇద్దరు కుమారులు కరోనా బారిన పడ్డారు. హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఆదిలక్ష్మిలో వైరస్‌ లక్షణాలు కనిపించడంతో ఐదు రోజుల కిందట నిర్థారణ పరీక్షలు చేసుకున్నారు. కానీ ఫలితం ఇంతవరకూ రాలేదు. ఇంతలోనే ఆమె అస్వస్థతకు గురై కన్నుమూశారు. ఇటువంటి అత్యవసర సమయాల్లో డీజిల్‌ లేదన్న సాకుగా చూపి వాహనం రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాహనం సకాలంలో వచ్చి ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై డిప్యూటీ తహసీల్దారు షరీఫ్‌ను వివరణ కోరగా... వాహనం నిత్యం అందుబాటులోనే ఉంటుందని తెలిపారు. ఈ విషయం తమ దృష్టికి రాలేదన్నారు. 

Updated Date - 2021-05-10T04:45:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising