బాధితులకు మరింత దగ్గరయ్యేందుకే డయల్ యువర్ ఎస్పీ: విశాల్ గున్ని
ABN, First Publish Date - 2021-07-26T19:31:44+05:30
డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ప్రారంభించనున్నారు. ప్రతి బుధవారం ఉదయం 11 - 12 గంటల మధ్యలో ఎస్పీకి ఫోన్ చేయవచ్చు.
గుంటూరు: డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ప్రారంభించనున్నారు. ప్రతి బుధవారం ఉదయం 11 - 12 గంటల మధ్యలో ఎస్పీకి ఫోన్ చేయవచ్చు. బాధితులకు మరింత దగ్గరయ్యేందుకు ఈ కార్యక్రమమని విశాల్ గున్ని తెలిపారు. ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమం యధాతథమన్నారు. వృద్ధులు, మహిళల సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. గంట పాటు జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఫోన్ ద్వారా గ్రీవెన్స్ వింటామన్నారు. సుదూర ప్రాంతాల నుంచి రాలేని వాళ్ళకు డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఎస్పీ విశాల్ గున్ని పేర్కొన్నారు.
Updated Date - 2021-07-26T19:31:44+05:30 IST