ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ ఇచ్చి సోనియా తప్పు చేశారు

ABN, First Publish Date - 2021-03-17T09:12:09+05:30

‘‘నేను పుట్టి పెరిగింది కాంగ్రె్‌సలోనే.. నా ఉన్నతికి కారణమూ కాంగ్రెస్‌ పార్టీనే. ఈ పార్టీ బాగుండాలనే నేను కోరుకుంటాను. కానీ ఇవాళ కాంగ్రెస్‌ దుస్థితి చూస్తుంటే బాధేస్తోంది. నేను సీఎం.. నేను సీఎం అని పోటీలు పడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రం విడిపోయాక ఇద్దరమూ నాశనమైపోయాం

ఏడాదిన్నరలో ఏపీలోకి షర్మిల ప్రవేశం

టీ-కాంగ్రెస్‌ నేతలతో జేసీ దివాకర్‌రెడ్డి చిట్‌చాట్‌

రాయల తెలంగాణకు పొన్నం, వివేక్‌ నో: రాజగోపాల్‌


హైదరాబాద్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ‘‘నేను పుట్టి పెరిగింది కాంగ్రె్‌సలోనే.. నా ఉన్నతికి కారణమూ కాంగ్రెస్‌ పార్టీనే. ఈ పార్టీ బాగుండాలనే నేను కోరుకుంటాను. కానీ ఇవాళ కాంగ్రెస్‌ దుస్థితి చూస్తుంటే బాధేస్తోంది. నేను సీఎం.. నేను సీఎం అని పోటీలు పడి పార్టీని నాశనం చేశారు’’ అని టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ సీఎల్పీ కార్యాలయానికి వచ్చిన ఆయన.. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో సంభాషిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలా అయితే కేసీఆర్‌ను ఓడించలేరనీ అన్నారు. తెలంగాణ ఇచ్చి సోనియా తప్పు చేశారని, రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఇద్దరమూ (రెండు రాష్ట్రాలూ) నాశనమైపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. భట్టి జోక్యం చేసుకుని జేసీ దివాకర్‌రెడ్డిని కాంగ్రె్‌సలోకి రావాలని కోరారు. దానికి జేసీ స్పందిస్తూ.. తాను కాంగ్రె్‌సలో ఉంటే బతికే చాన్స్‌ లేదన్నారు. కాంగ్రె్‌సలో భవిష్యత్తూ లేదని పేర్కొన్నారు. రాజగోపాల్‌రెడ్డి స్పందిస్తూ.. ‘‘రాయల తెలంగాణ ఇస్తే కాగ్రె్‌సకు మేలు జరుగుతుందని సోనియా గాంధీకి నేను చెప్పాను. రాయల తెలంగాణ ఏర్పడితే.. రాయలసీమ నేతలే పెత్తనం చేస్తారంటూ అప్పటి పార్టీ ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ ఒప్పుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్‌ఎ్‌సపైన యుద్ధం చేయాల్సి ఉంది. కానీ కాంగ్రె్‌సలో ఆ పరిస్థితి లేదు’’ అని అన్నారు. ఈ సందర్భంగా జేసీ జోక్యం చేసుకుంటూ.. ఇక కాంగ్రెస్‌ నేతలు కొత్త మార్గాలు చూసుకోవాల్సిందేనని అన్నారు.   


జగన్‌, సాయిరెడ్డిలకు నోటీసులు ఇవ్వాలంటే లారీలు కావాలి

టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసు ఇవ్వడానికి.. ఒక కానిస్టేబుల్‌ వెళ్లి కాగితం ఇచ్చి వస్తే సరిపోయిందని, అదే ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలకు నోటీసులు ఇవ్వాలంటే లారీలే కావాల్సి ఉంటుందని జేసీ దివాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రస్తుతం షర్మిల వామప్‌ చేస్తోందని, ఏడాదిన్నర లో ఏపీలోకి ఎంటరవుతుందని వ్యాఖ్యానించారు. విజయమ్మకు షర్మిలపైనే ప్రేమ ఎక్కువన్నారు. షర్మిలకు జగన్‌ ఏదైనా కీలక పదవిని ఇస్తే సమస్య సమసిపోయేదని ఆయన అన్నారు. 

Updated Date - 2021-03-17T09:12:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising