ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి పేర్ని నానికి సోము వీర్రాజు కౌంటర్

ABN, First Publish Date - 2021-12-29T16:58:01+05:30

మంత్రి పేర్ని నాని‌కి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: మంత్రి పేర్ని నాని‌కి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా తమ్ముడు పేర్ని నానికి వినమ్రంగా చెప్తున్నా.. మాట్లాడే ముందు అన్నీ తెలుసుకుని మాట్లాడాలి. పేర్ని నాని ముందు నోరు అదుపులో పెట్టుకోవాలి. అలాగే మంత్రి కొడాలి నానికి చేతికి తాళ్లు ఎక్కువ.. బ్రెయిన్ తక్కువ. మా పార్టీని ఎవరో ఎంపీకి లీజ్‌కి ఇచ్చామని మాట్లాడారు. ఎలక్షన్ ముందు తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వచ్చిన వారికి మీరు ఏమి లీజులు ఇచ్చారో చెప్పమంటారా.? మీ లీజుల గురించి మేము మాట్లాడితే చొక్కాలు ఊడిపోతాయి. మా పార్టీ కార్యాలయాల అద్దెలపై మాట్లాడుతున్నారు... మీ అద్దెలు ఎవరు కడుతున్నారో అందరికీ తెలుసు. కడప, తిరుపతి ఎన్నికపై చర్చిద్దాం దమ్ముంటే రండి. తమ్మినేని సీతారాం స్పీకర్ అన్న విషయం మర్చిపోయారు. తమ్మినేని స్టీల్ ప్లాంట్‌పై పోరాటం మాని తోటపల్లి, వంశధార ప్రాజెక్టులపై పోరాటం చెయాలి. బీజేపీ చరిత్ర గురించి మంత్రి బొత్స సత్యనారయణ తెలుసుకోవాలి’’ అని సూచించారు.


‘‘సినిమా టికెట్లు తగ్గించి సంకలు గుద్దుకుంటున్నారు. మరి పేదలు తినే నిత్యావసర వస్తువుల ధరలు సీఎం జగన్మోహన్‌రెడ్డి తగ్గించరా.? మీకు తినే తిండి కన్నా... వినోదమే ముఖ్యమైన అంశమా.? మీకు దమ్ముంటే ఈ ధరలు తగ్గించి మాట్లాడండి. మద్యం రేట్లు పెంచిన సీఎం జగన్మోహన్‌రెడ్డి సినిమా టికెట్ రెట్లు ఎందుకు పెంచడం లేదు. మద్యం అధిక ధరకు అమ్మి పేదల రక్తంతో ఆదాయం పెంచుకుంటున్నారు. 2014లో టీడీపీ బీజేపీ పొత్తుతో అధికారంలోకి వచ్చిన విషయం పయ్యావుల కేశవ్ మర్చిపోయారా.?  బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న జనసేన స్టీల్ ఫ్లాంట్‌తో పాటు, ఇతర ప్రాజెక్టులపై కూడా ఉద్యమం చేయాలి. మాకు ఫుల్ గ్లాస్ టీ కావాలని కోరుకుంటున్నాం.. ఏపీలో వైసీపీ మైండ్ గేమ్ ఆడి.. రాష్ట్రాన్ని అపప్రద చేస్తున్నారు. అభివృద్ధి గురించి మాట్లాడితే.. మాపై నిందలు మోపుతారా..?.ఏపీలో రాజకీయ శూన్యత ఉందని, రాష్ట్రంలో బీజేపీ ఇకపై దూకుడుగా వెళ్లబోతోంది. ప్రజల కోరుకుంటున్న ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా బీజేపీ ఎదగడానికి కార్యచరణ రూపొందించింది. బీజేపీ అధికారంలోకి వస్తే ట్రేడింగ్ చెయ్యదు రూలింగ్ చేస్తుంది.  రేపటి నుంచి బీజేపీ మైండ్ గేమ్ ఏమిటో చూస్తారు. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులపై బీజేపీ పోరుబాట పట్టబోతుంది. ఉత్తరాంధ్ర వెనుక బడిన జిల్లాలపై బీజేపీ ఫోకస్ చేస్తుంది.’’ అని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-12-29T16:58:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising