ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింహాచలం పాత గోశాలను సందర్శించిన మంత్రి అవంతి

ABN, First Publish Date - 2021-08-19T00:32:49+05:30

సింహాచలం పాత గోశాలను మంత్రి అవంతి శ్రీనివాసరావు సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: సింహాచలం పాత గోశాలను మంత్రి అవంతి శ్రీనివాసరావు సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరుసగా లేగదూడల మృతిపై విచారమన్నారు. గో సంరక్షణ అధికారుల తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యకరమైన లేగదూడలనే సమర్పించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. పాత గోశాలలో ఉన్న లేగదూడలను దారపాలెం గోశాలకు తరలిస్తామని తెలిపారు. సమస్యను సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని, మరికొన్ని నిధులు కేటాయించేలా కృషి చేస్తామని అవంతి శ్రీనివాస్ చెప్పారు. 


సింహాచలం పాత గోశాలలో విస్తుబోయే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వర్షం పడడంతో గోశాల మొత్తం బురదమయం అయిపోయింది. దీంతో లేగదూడలు జారిపడుతున్నాయి. అత్యంత దీనావస్ధలో ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. గోశాల నిర్వహణపై ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్వహణ చేతకాకపోతే హిందువులకు అప్పగించాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2021-08-19T00:32:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising