ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖను సముద్రమే అంతం చేయనుందా?

ABN, First Publish Date - 2021-08-13T22:24:26+05:30

విశాఖ డేంజర్ జోన్‌లో ఉందా? విశాఖకు మణిహారమైన సముద్రమే అంతం చేయనుందా? ఇప్పుడు ఐపీసీసీ ఇచ్చిన నివేదిక చర్చనీయంశంగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: విశాఖ డేంజర్ జోన్‌లో ఉందా? విశాఖకు మణిహారమైన సముద్రమే అంతం చేయనుందా? ఇప్పుడు ఐపీసీసీ ఇచ్చిన నివేదిక చర్చనీయంశంగా మారింది. నాసా చేపట్టిన సముద్ర మట్టాల పెరుగుదల అధ్యయనాలతో విశాఖకు ముప్పు పొంచి ఉందని ఐపీసీసీ అంచనా వేసింది. కోస్తాలో విశాఖలో ఉన్న పారిశ్రామిక ప్రాంతాలు, భీమిలి ప్రాంతంలో గల కాపులుప్పాడ, మత్య్యకార కాలనీలు సముద్ర మట్టానికి దిగువన ఉన్నాయి. ఐపీసీసీ ఇచ్చిన నివేదిక అంచనాలు నిజమైతే విశాఖతో పాటు 12 ప్రాంతాలు నీట మునుగుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 


విశాఖ నీట మునిగే ప్రమాదం ఉందని ఐపీసీసీ ఇచ్చిన నివేదికను తేలికగా తీసుకోలేమని శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా డైరెక్టర్ ప్రొఫెసర్‌ డాక్టర్ రావు తటవర్తి పేర్కొన్నారు. మానవాళి తప్పిదాలు, కాలుష్యం పెరిగిపోవడం కారణంగా ఇటువంటి ప్రమాదాలు వచ్చే ఆవకాశాలున్నాయని ఆయన చెబుతున్నారు. 2015లో గాయిత్రి విద్యాపరిషత్, సెంట్రల్ యూనివర్సీటి ఆఫ్ హైదరబాద్, మేరిటైమ్ యూనివర్సీటి ఒక బృందంగా ఏర్పడి సముద్రకోతపై పరిశోధన చేశాయని తెలిపారు. మూడు యూనివర్సిటీలు చేసిన పరిశోధన నివేదికను ప్రభుత్వానికి అందించాయి. విశాఖ సాగర తీరంలోని స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు ప్రమాదకర స్థాయిలోనే ఉన్నాయని వెల్లడించారు. పాలకులు దృష్టి సారించకపోతే విశాఖ మరో వెనిస్ నగరంగా మారుతుందని రావు తటవర్తి హెచ్చరించారు. 

Updated Date - 2021-08-13T22:24:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising