ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను నట్టేట ముంచిన వైసీపీ: శశిభూషణ్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-12-29T17:39:33+05:30

వైసీపీ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: వైసీపీ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత రెండేన్నరేళ్లలో వైసీపీ వ్యవసాయాన్ని అధోగతి పాలు చేసిందని మండిపడ్డారు. ఎన్నికల ముందు రైతులకు అనేక హామీలిచ్చి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదన్నారు. రైతులకు కేంద్రం ఇచ్చే నిధులు నవరత్నాలకు తరలిస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ జిల్లాల్లో అధిక వర్షంతో రైతులు తీవ్రంగా నష్ట పోయారన్నారు. ధాన్యాన్ని సేకరించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. త్వరలో కమీషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. తామర పురుగు దాడిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. పంట నష్టం అంచనాలు రూపొందించి కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేశారు. కిసాన్ ఫసల్ బీమా అమలు చేసి ఉంటే రైతులను ఆదుకోనే అవసరం ఉండేదని చెప్పారు. రాయలసీమలో అధిక వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రెండు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని శశిభూషణ్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2021-12-29T17:39:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising