ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్పంచే ఆటో డ్రైవరై..

ABN, First Publish Date - 2021-04-22T10:14:48+05:30

కరోనా సోకిన వారికి కుటుంబ సభ్యులే ఆమడ దూరం పెడుతున్న తరుణంలో ఓ సర్పంచ్‌ తన దయాగుణాన్ని చాటుకున్నారు. కరోనా సోకిన మహిళను ఆస్పత్రికి తరలించేందుకు అందరూ జంకుతుంటే ఆయన మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి ఆమెను ఆస్పత్రిలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కరోనా రోగిని ఆస్పత్రికి తరలించిన దాతృత్వం


విజయవాడ రూరల్‌, ఏప్రిల్‌ 21: కరోనా సోకిన వారికి కుటుంబ సభ్యులే ఆమడ దూరం పెడుతున్న తరుణంలో ఓ సర్పంచ్‌ తన దయాగుణాన్ని చాటుకున్నారు. కరోనా సోకిన మహిళను ఆస్పత్రికి తరలించేందుకు అందరూ జంకుతుంటే ఆయన మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి ఆమెను ఆస్పత్రిలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. విజయవాడ రూరల్‌ మండలం అంబాపురానికి చెందిన గండికోట సీతయ్య.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ సర్పంచ్‌గా గెలుపొందారు. గ్రామానికి చెందిన ఒక మహిళకు (55) బుధవారం కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయింది. ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు గ్రామంలో ఎవరూ ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న సీతయ్య పీపీఈ కిట్‌ ధరించి, ఆయనే స్వయంగా ఆటో నడుపుతూ ఆమెను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ఆమె తనను ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లాలని కోరడంతో అదే ఆటోలో తీసుకెళ్లి ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లతో మాట్లాడి ఇంటికి చేరుకున్నారు. కరోనా కష్టకాలంలో బాధిత మహిళకు అండగా నిలిచిన సర్పంచ్‌ను అందరూ అభినందిస్తున్నారు. 

Updated Date - 2021-04-22T10:14:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising