ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భర్త స్నేహితురాలిపై సెక్షన్‌ 498ఏ చెల్లదు

ABN, First Publish Date - 2021-07-26T09:04:52+05:30

‘భర్త సంబంధీకులు, వివాహం ద్వారా బంధువులైన వారిపై మాత్రమే ఐపీసీ సెక్షన్‌ 498 ఏ చెల్లుబాటు అవుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘దిశ కేసు’లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

అమరావతి, జూలై 25(ఆంధ్రజ్యోతి): ‘‘భర్త సంబంధీకులు, వివాహం ద్వారా బంధువులైన వారిపై మాత్రమే ఐపీసీ సెక్షన్‌ 498 ఏ చెల్లుబాటు అవుతుంది. భర్త స్నేహితురాలిపై, వివాహేతర సంబంధాన్ని కలిగిన మహిళపై సంబంధిత సెక్షన్‌ కింద కేసు నమోదు చేయడానికి వీల్లేదు’’ అని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. తన భర్తతో వివాహేతర సంబంధం కలిగి ఉందంటూ ఓ మహిళపై నెల్లూరు జిల్లా దిశ పోలీస్‌ స్టేషన్‌లో వివాహిత కె.సునీత ఫిర్యాదు చేసింది. పోలీసులు సెక్షన్‌ 498 ఏతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదు చేసిన వివాహిత... భర్తను మొదటి నిందితుడిగా, అతనితో సంబంధం పెట్టుకున్న మహిళను రెండో నిందితురాలిగా పేర్కొన్నారు.


దిశ పోలీసులు సెక్షన్‌ 498ఏ కింద కేసు నమోదు చేయడాన్ని సవాల్‌ చేస్తూ నిందితురాలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... పిటిషనర్‌, ఫిర్యాదు చేసిన వివాహిత భర్తకు ఏవిధంగాను బంధువు కాదన్నారు. ఈ నేపథ్యంలో పిటిషనర్‌పై పోలీసులు సెక్షన్‌ 498ఏ కింద కేసు నమోదు చేయడానికి వీల్లేదన్నారు. ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పులు ఉన్నాయన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి పిటిషనర్‌పై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. వ్యాజ్యంలో మొదటి నిందితుడిగా ఉన్న వ్యక్తిపై విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేశారు.

Updated Date - 2021-07-26T09:04:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising