ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దాడులపై ప్రశ్నిస్తే దమనకాండలు, అణచివేతలా?: సప్తగిరి ప్రసాద్

ABN, First Publish Date - 2021-08-11T02:53:23+05:30

దాడులపై ప్రశ్నిస్తే దమనకాండలు, అణచివేతలా? అని సీఎం జగన్‌రెడ్డి, వైసీపీ ప్రభుత్వ తీరును తెలుగుదేశం నేత సప్తగిరి ప్రసాద్ ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: దాడులపై ప్రశ్నిస్తే దమనకాండలు, అణచివేతలా? అని సీఎం  జగన్‌రెడ్డి, వైసీపీ ప్రభుత్వ తీరును తెలుగుదేశం నేత సప్తగిరి ప్రసాద్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ హత్యాచార నిరోధక చట్టం ఒక జగన్నాథ రథచక్రం లాంటిదన్నారు.చట్టాన్ని దుర్వినియోగం చేస్తే ఆ జగన్నాథ రథచక్రాల కింద పడి జగన్ రాజకీయ జీవితం నలిగి నుజ్జు నుజ్జు అవ్వకతప్పదని హెచ్చరించారు. దళిత బిడ్డలు చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, అంబేడ్కర్ ఓవర్సీస్ లాంటి పథకాలను ప్రారంభించారని చెప్పారు.


కానీ నేడు అధికారంలో ఉన్న జగన్ వాటన్నింటిని రద్దు చేసి దళిత జీవ క్రాంతి పేరుతో గొర్రెలు, మేకలు ఇస్తున్నారని మండిపడ్డారు. దళిత బిడ్డలు గొర్రెలు, మేకలు కాసుకోవాలా? అని ప్రశ్నించారు. ఇంటింటికీ రూ.100లు జీతం తీసుకునే నేపాలి గుర్కాలు చాలా బాధ్యతాయుతంగా ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కల్పిస్తున్నారన్నారు. లక్షల రూపాయలు జీతాలుగా తీసుకుంటుంటున్న పోలీసులు మాత్రం వైసీపీ గూండాలకు రక్షణ కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీలో ఉన్న దళిత నాయకులు తమ ప్రోటోకాల్ గురించి కూడా ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారని సప్తగిరి ప్రసాద్ అన్నారు. 

Updated Date - 2021-08-11T02:53:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising