ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవన్‌ నటుడు... చంద్రబాబు సహజ నటుడు

ABN, First Publish Date - 2021-04-16T10:28:00+05:30

‘‘జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నటుడైతే... రాజకీయాల్లో చంద్రబాబు సహజ నటుడు. లోపాయికారిగా ఒక్కటిగా, బహిరంగంగా విడివిడిగా టీడీపీ, బీజేపీ, జనసేన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లోకేశ్‌ దెబ్బకు టీడీపీ దివాలా తీసింది: సజ్జల


అమరావతి, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): ‘‘జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నటుడైతే... రాజకీయాల్లో చంద్రబాబు సహజ నటుడు. లోపాయికారిగా ఒక్కటిగా, బహిరంగంగా విడివిడిగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు తిరుపతిలో పోటీ చేస్తున్నాయి. తెలుగుదేశం, బీజేపీ రెండూ డిపాజిట్ల కోసం పోటీ పడుతున్నాయి’’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు చదివిన స్ర్కిప్టునే బీజేపీ జాతీయ నాయకులు తిరుపతి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కెమెరాల ముందు చదువుతున్నారని ఆరోపించారు. వైసీపీపై బీజేపీ, టీడీపీ అసత్య అరోపణలు చేస్తున్నాయన్నారు.


గత ఎన్నికల్లో  ఈ రెండు పార్టీలకూ ప్రజలు ఛీ కొట్టినా బుద్దిరాలేదన్నారు. ప్రజల్లో సీఎం జగన్‌కు వస్తున్న ఆదరణను చూడలేక దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. టీడీపీ పనైపోయిందని ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారన్నారు. లోకేశ్‌ దెబ్బకు టీడీపీ దివాలా తీసిందన్నారు. వాళ్లు అధికారంలో ఐదేళ్లలో ఎందుకు హోదాతో సహా ఇతర అంశాల్లో ఫెయిలయ్యారో ప్రజలకు వివరించకుండా వరుసపెట్టి తప్పుడు ఆరోపణల కఽథలు అల్లుతున్నారని సజ్జల ఆరోపించారు.

Updated Date - 2021-04-16T10:28:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising