ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గదుల సులభతర రిజిస్ర్టేషన్‌ ప్రారంభం

ABN, First Publish Date - 2021-06-13T08:30:15+05:30

భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని ఆరు ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా వసతి గదుల కోసం పేర్లు రిజిస్ట్రేషన్‌ చేసుకునే సులభతర విధానాన్ని టీటీడీ శనివారం ప్రారంభించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని ఆరు ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా వసతి గదుల కోసం పేర్లు రిజిస్ట్రేషన్‌ చేసుకునే సులభతర విధానాన్ని టీటీడీ శనివారం ప్రారంభించింది. తిరుమలలోని సీఆర్వో వద్ద టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి పూజలు నిర్వహించి కౌంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భక్తులకు త్వరితగతిన పేర్ల నమోదు, గదుల కేటాయింపునకు తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇందులో భాగంగా సీఆర్వో, బాలాజీ బస్టాండ్‌, కౌస్తుభం, రాంభగీచ బస్టాండ్‌, ఎంబీసీ, జీఎన్సీ టోల్‌గేట్‌ వద్ద రెండు కౌంటర్ల చొప్పున ఏర్పాటు చేశామన్నారు. భక్తులు ఈ కౌంటర్ల ద్వారా పేర్లు రిజిస్ర్టేషన్‌ చేసుకున్న తర్వాత ఎస్‌ఎంఎస్‌ ద్వారా వారికి కేటాయించిన గదుల సమాచారం తెలియజేస్తామని, ఉప విచారణ కార్యాలయాల వద్ద రుసుం చెల్లించి గదులు పొందవచ్చన్నారు.

Updated Date - 2021-06-13T08:30:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising