ఏపీఎస్‌డీసీకి ఆదాయం మళ్లింపు చట్టవిరుద్ధం
ABN, First Publish Date - 2021-08-27T09:21:32+05:30
రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్‌లో జమ చేయకుండా నేరుగా ఏపీఎ్‌సడీసీకి తరలించడం చట్టవిరుద్ధమని సీనియర్ న్యాయవాది బసవప్రభు పాటిల్ హైకోర్టులో..
హైకోర్టులో సీనియర్ న్యాయవాది పాటిల్ వాదనలు
కన్సాలిడేటెడ్ ఫండ్‌లో జమ చేసిన తరువాతే మళ్లిస్తున్నాం
ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే
విచారణ వచ్చే నెల 7కి వాయిదా
అమరావతి, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్‌లో జమ చేయకుండా నేరుగా ఏపీఎ్‌సడీసీకి తరలించడం చట్టవిరుద్ధమని సీనియర్ న్యాయవాది బసవప్రభు పాటిల్ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఏపీఎ్‌సడీసీ చట్టంలోని సెక్షన్ 12(1)(4)(5)ను రద్దు చేయాలని కోరారు. అదనపు సమాచారంతో డాక్యుమెంట్లను కోర్టు ముందు ఉంచేందుకు సమయం ఇవ్వాలని కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను సెప్టెంబరు 7కి వాయిదా వేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ అరూ్‌పకుమార్ గోస్వామి జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని నేరుగా ఏపీఎ్‌సడీసీకి బదిలీ చేయడానికి వీలు కల్పిస్తున్న ఏపీఎ్‌సడీసీ చట్టంలోని సెక్షన్ 12(1)(4)(5)ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.
విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ... కన్సాలిడేటెడ్ ఫండ్‌లో నిధులు జమ చేసిన తరువాతే ఏపీఎ్‌సడీసీకి మళ్లిస్తున్నామని, దీనిపై ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశామన్నారు. మరోవైపు ప్రభుత్వ ఆస్తులను, భవనాలను తనఖా పెట్టి రుణం పొందేందుకు ఏపీఎ్‌సడీసీకి చట్టబద్ధ హోదా కల్పిస్తున్న ఏపీ స్టేట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్3(3), 4ను రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ విజయవాడకు చెందిన కె.హిమబిందు దాఖలు చేసిన మరో వ్యాజ్యంపై న్యాయవాది బి.నళిన్ కుమార్ వాదనలు వినిపించారు. వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించడంపై ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే అభ్యంతరం లేవనెత్తారు. ఏపీఎ్‌సడీసీ విషయంలో 2020లో ఇచ్చిన జీవోలను సవాలు చేస్తూ ఇప్పుడు పిల్ దాఖలు చేయడం సరికాదన్నారు. పిల్ దాఖలు చేయడంలో తీవ్ర జాప్యం ఉందని, వ్యాజ్యాన్ని కొట్టివేయాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.... ఆర్బీఐ తరఫు న్యాయవాది గురించి ఆరా తీసింది. న్యాయవాది వెంకట కృష్ణారావు స్పందిస్తూ పిటిషనర్ దస్త్రాలను ఆర్‌బీఐకి పంపారన్నారు. ఆర్‌బీఐ నుంచి సమాచారం వచ్చాక స్పందిస్తాన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను సెప్టెంబరు 7కి వాయిదా వేసింది.
Updated Date - 2021-08-27T09:21:32+05:30 IST