ఏప్రిల్‌లో తిరుపతి-షిర్డీ రైళ్ల పునరుద్ధరణ
ABN, First Publish Date - 2021-03-05T09:19:18+05:30
రైళ్ల పునరుద్ధరణలో భాగంగా ఏప్రిల్ నెలలో తిరుపతి, షిర్డీ మధ్య.. విజయవాడ, గూడూరు మధ్య నడిచే 4 ప్రత్యేక రైళ్లను పునరుద్ధరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
హైదరాబాద్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): రైళ్ల పునరుద్ధరణలో భాగంగా ఏప్రిల్ నెలలో తిరుపతి, షిర్డీ మధ్య.. విజయవాడ, గూడూరు మధ్య నడిచే 4 ప్రత్యేక రైళ్లను పునరుద్ధరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. తిరుపతి-షిర్డీ ట్రెయిన్ ఏప్రిల్ 6న ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతుందని, ఇది ప్రతి మంగళవారం నడుస్తుందని పేర్కొంది. షిర్డీ-తిరుపతి ట్రెయిన్ ఏప్రిల్ 7న రాత్రి 7.35 గంటలకు ప్రారంభమవుతుందని, ఇది ప్రతి బుధవారం నడుస్తుందని తెలిపింది. విజయవాడ-గూడూరు ట్రెయిన్ ఏప్రిల్ 1న, గూడూరు-విజయవాడ ట్రెయిన్ 2న ప్రారంభమవుతాయని, ఈ రెండు రైళ్లు ప్రతి రోజూ నడుస్తాయని వివరించింది.
Updated Date - 2021-03-05T09:19:18+05:30 IST