ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పదవి అలంకారం కాదు బాధ్యత: సుప్రీంకోర్టు న్యాయమూర్తి

ABN, First Publish Date - 2021-10-31T21:37:49+05:30

వ్యక్తులకు పదవి అలంకారం కాదు బాధ్యత అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: వ్యక్తులకు పదవి అలంకారం కాదు బాధ్యత అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు అన్నారు. పూర్వ విద్యార్థులు ఎదిగిన తర్వాత తమ స్కూలు గురించి మర్చిపోకుండా స్కూలు అభివృద్ధికి సహకారం అందించారన్నారు. పదవి వచ్చిన తర్వాత సమాజం గురించి మర్చిపోకుండా సేవ చేయడమే పదవికి న్యాయం చేయడమని ఆయన పేర్కొన్నారు. మనిషికి మానసిక వికాసానికి విద్య ఉపయోగపడుతుందన్నారు. సమాజం, దేశం అభివృద్ధి చెందడానికి విద్యే కారణమన్నారు. విద్య ప్రాధాన్యత గురించి ఆలోచించి స్కూలు ఏర్పాటు చేసిన సీతారామయ్య అభినందనీయులన్నారు.


 కులం, మతం మనం కల్పించుకున్నవని ఆయన పేర్కొన్నారు. లేని వాళ్ళని పైకి తీసుకురావడం కూడా ప్రాథమిక హక్కేనని ఆయన అన్నారు. కులం, మతం ఏదైనా అందరూ సమానమేనన్నారు. కులం ఏంటి అని తమ స్నేహితులను విద్యార్థులు అడగవద్దని ఆయన హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్ర్యం ప్రాథమిక హక్కన్నారు. జడ్జిమెంట్ తప్పని చెప్పవచ్చు, కానీ వ్యక్తిగతంగా విమర్శించకూడదని ఆయన సూచించారు. సోషల్ మీడియాలో కులం,మతం ఆధారంగా జరుగుతున్న ప్రచారం ఆపేయాలన్నారు.


కరోనా సమయంలో సంపాదన పరులైన తల్లిదండ్రులని ఎంతోమంది పిల్లలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. అటువంటి పిల్లలకు కనీస సదుపాయాలు కల్పించగలిగామని ఆయన పేర్కొన్నారు. మనకు చట్టాలు చాలా ఉన్నాయని, కానీ వాటి అమలులోనే సమస్య ఉందని న్యాయమూర్తి నాగేశ్వరరావు అన్నారు. 

Updated Date - 2021-10-31T21:37:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising