ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం: రఘురామ

ABN, First Publish Date - 2021-07-20T20:31:19+05:30

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగిందని ఎంతో కాలంగా నిందలు వేశారని, ఇప్పుడేమంటారని వైసీపీ నేతలను ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగిందని ఎంతో కాలంగా నిందలు వేశారని, ఇప్పుడేమంటారని వైసీపీ నేతలను ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అబద్ధాలను ప్రచారం చేశారని, దాని వల్ల 150 మందికి పైగా రైతులు మృతి చెందారని తెలిపారు. వారి చావులకు ప్రభుత్వమే బాధ్యత వహించి సీఎం జగన్‌ ఓదార్చాలని కోరారు. విశాఖలో తమ ప్రభుత్వం వచ్చాక ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగిందని తెలిపారు. దసపల్లా హోటల్ భూములు ఎవరి చేతుల్లోకి వెళ్లాయో తెలాలని, నిజాయితీగల అధికారితో ఉత్తరాంధ్రలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా అంశంపై సీఎం ఆదేశిస్తే రాజీనామాకు ఎంపీలందరం సిద్ధమని రఘురామ ప్రకటించారు.


‘‘నాపై అనర్హత వేటు పడదు. మీ బెయిల్ రద్దు చేయమని అనడం రాజద్రోహం ఎలా అవుతుంది. వాట్సాప్‌లో చాటింగ్ బయట పెట్టామని అంటున్నారు.. నా ఫోన్ పోలీసులు తీసుకున్నారు. పెగసెస్ సాఫ్ట్‌వేర్ మీరు తెప్పించారని అంటున్నారు. మీరు చాలా మందిపై వాడారని అంటున్నారు, మీరు కేంద్రం అనుమతి తీసుకున్నారా?’’ అని రఘురామ ప్రశ్నించారు.


Updated Date - 2021-07-20T20:31:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising