ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

27 టీఎంసీలు విడుదల చేయండి

ABN, First Publish Date - 2021-07-25T07:53:48+05:30

రాష్ట్రావసరాల కోసం 27 టీఎంసీ ల కృష్ణా జలాలను విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య సంస్థ(కేఆర్‌ఎంబీ)ని ఏపీ కోరింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేఆర్‌ఎంబీకి రాష్ట్ర ప్రభుత్వ ఇండెంట్‌


అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రావసరాల కోసం 27 టీఎంసీ ల కృష్ణా జలాలను విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య సంస్థ(కేఆర్‌ఎంబీ)ని ఏపీ కోరింది. ఈ మేరకు జలవనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి శనివారం ఇండెంట్‌ను పంపారు. తెలంగాణ ఇప్పటికే 82.40టీఎంసీల కృష్ణాజలాలను 66:34 దామాషాలో తన వాటా 299 టీఎంసీల నుంచి వినియోగించుకుందని వెల్లడించారు. శనివారం నాటికి శ్రీశైలంలో నీటిమట్టం 853.70 అడుగులు, నీటినిల్వ 88.47టీఎంసీలు ఉందని తెలిపారు. అలాగే, నాగార్జునసాగర్‌లో నీటిమట్టం 536.50 అడుగులు, నీటినిల్వ 181.11 టీఎంసీలు, పులిచింతలలో నీటిమట్టం 173.738 అడుగులు, నీటి నిల్వ 43.79 టీఎంసీలు ఉన్నట్టు వివరించారు. తెలంగాణలోని జూరాల, ఏపీలోని ప్రకాశం బ్యారేజీలో నీటి నిల్వలు గరిష్ఠస్థాయిని దాటి ఉన్నాయని తెలిపారు. శ్రీశైలంలోకి 4లక్షల క్యూసెక్కుల వరద వస్తుందన్న అంచనాలు ఉన్నందున పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా తాగు నీరు, రాయలసీమకు సాగు నీరు, చెన్నైకి తాగునీటి అవసరాల కోసం మొత్తం 27 టీఎంసీలను విడుదల చేయాలని కోరారు. 

Updated Date - 2021-07-25T07:53:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising