రేపటి నుంచి రెగ్యులర్ రైళ్లు
ABN, First Publish Date - 2021-07-18T08:40:31+05:30
దగ్గరి ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది! గత ఏడాది లాక్‌డౌన్ కారణంగా నిలిపివేసిన రైళ్లను విడతల వారీగా ప్రారంభించనున్నట్లు ఓ ప్రకటనలో
82 అన్‌రిజర్వ్‌డ్ రైళ్ల పునరుద్ధరణ
66 ప్యాసింజర్లు, 16 ఎక్స్‌ప్రె్‌సలు
విడతలవారీగా ప్రారంభానికి నిర్ణయం
రైల్వేస్టేషన్లలో బుకింగ్‌కు అవకాశం
దక్షిణ మధ్య రైల్వే అధికారుల ప్రకటన
అన్‌రిజర్వుడులో సీజన్ టికెట్లకూ ఓకే
హైదరాబాద్, విజయవాడ, జూలై 17 (ఆంధ్రజ్యోతి): దగ్గరి ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది! గత ఏడాది లాక్‌డౌన్ కారణంగా నిలిపివేసిన రైళ్లను విడతల వారీగా ప్రారంభించనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. సోమవారం నుంచి దశలవారీగా 82 అన్‌రిజర్వ్‌డ్ రైళ్లను పునరుద్ధరించనున్నట్లు వివరించింది. వీటిలో 66 ప్యాసింజర్ రైళ్లు కాగా, 16 ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. లాక్‌డౌన్ తర్వాత నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ.. ముందస్తుగా టికెట్లు రిజర్వేషన్ చేసుకున్న వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తోంది. కొత్తగా పునరుద్ధరించిన 82 అన్‌రిజర్వ్‌డ్ రైళ్లలో ప్రయాణించేందుకు స్టేషన్లలోని బుకింగ్ కౌంటర్లలో అప్పటికప్పుడే టికెట్లు తీసుకునే వెసులుబాటును కల్పించింది. యూటీఎస్ యాప్ (ఆన్‌లైన్), ఏటీవీఎమ్ (ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషీన్), సీవోటీవీఎమ్(కాయిన్ టికెట్ వెండింగ్ మెషీన్)ల ద్వారా కూడా టికెట్లు తీసుకోవచ్చని ప్రకటించింది. సీజనల్ టికెట్లు కూడా అన్‌రిజర్వ్‌డ్ రైళ్లలో చెల్లుబాటవుతాయని తెలిపారు. రైల్వే స్టేషన్లు, రైళ్లలో కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య సూచించారు.
పునరుద్ధరించనున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇవే..
కాజీపేట్-సిర్పూర్ టౌన్ (రైల్ నంబరు: 07272), సిర్పూర్‌టౌన్-కాజీపేట్(07259), హైదరాబాద్-పూర్ణ (07653), పూర్ణ - హైదరాబాద్ (07654), విజయవాడ-గూడూరు (07262), కాకినాడ పోర్ట్-విజయవాడ (07264), కాకినాడ పోర్ట్-విశాఖపట్నం (07265), విశాఖపట్నం-కాకినాడ పోర్ట్ (07266), నర్సాపూర్-గుంటూరు (07268), గుంటూరు-నర్సాపూర్ (07267)
ప్యాసింజర్ రైళ్లు ఇవే..
వాడి-కాచిగూడ (07751), ఫలక్‌నుమా-వాడి (07752), డోర్నకల్-కాజీపేట్ (07754), విజయవాడ-డోర్నకల్ (07756), సికింద్రాబాద్-కలబుర్గీ (07760), బీదర్-కలబుర్గీ (రైల్ నంబర్లు: 07761, 07763), కలబుర్గీ-బీదర్ (రైల్ నంబర్లు: 07762, 07764), రాజమండ్రి-విజయవాడ (07767), విజయవాడ-మచిలీపట్నం (07769), నిడదవోలు-నర్సాపూర్(07771), నర్సాపూర్-నిడదవోలు (07772), పూర్ణ - అకోలా(07773), అకోలా-పూర్ణ (07774), నాందేడ్-రోటేగావ్(07777), రోటేగావ్-నాందేడ్ (07778), మాచర్ల-విజయవాడ(07782), కాచిగూడ-మహబూబ్‌నగర్(07789), మహబూబ్‌నగర్-కాచిగూడ(07790), కాచిగూడ-నడికుడి (07791), నడికుడి-కాచిగూడ(07792), కాచిగూడ-కరీంనగర్ (07793), గుంతకల్-రాయిచూర్ (07799), గుంతకల్-తిరుపతి (07655), మచిలీపట్నం-విజయవాడ(07770), రేణిగుంట-గుంతకల్(07657), గుంతకల్-రేణిగుంట (07658), గూడూరు-రేణిగుంట (07666)
Updated Date - 2021-07-18T08:40:31+05:30 IST