ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ హెచ్‌ఎంల నుంచి రికవరీ చేయండి

ABN, First Publish Date - 2021-11-26T09:44:52+05:30

ఆ హెచ్‌ఎంల నుంచి రికవరీ చేయండి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

1,477 పాఠశాలల్లో లేని మరుగుదొడ్లు 

అయినా ఆయాలను నియమించి జీతాలు

ప్రధానోపాధ్యాయులపై చర్యలకు ఉత్తర్వులు


అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 1477 పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకున్నా వాటిని శుభ్రం చేసేందుకంటూ ఆయాలను నియమించి, వారికి జీతాలు ఇచ్చారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వివిధ యాప్‌లలో అప్‌లోడ్‌ చేసిన సమాచారంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని, వారి నుంచి ఆయాల జీతాల రూపంలో ఖర్చుపెట్టిన మొత్తాలను రికవరీ చేయాలని మఽధ్యాహ్న భోజన డైరెక్టర్‌ దివాన్‌ ఆదేశించారు. గురువారం జిల్లా విద్యా శాఖ అధికారులకు దీనిపై ఒక మెమో జారీ చేశారు. మరోవైపు 933 పాఠ శాలల్లో మరుగుదొడ్లున్నా ఆయాలు లేరని తేలిందన్నారు. ఈ విషయంపైనా చర్యలు తీసుకోవాలని సూచించారు.   


‘చదవడం మాకిష్టం’ అమలు చేయండి

అన్ని పాఠశాలల్లో 3 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ‘చదవడం మాకిష్టం’ అనే కార్యక్రమాన్ని అమలు చేయాలని పాఠశాల విద్య డైరెక్టర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు నిర్దేశించారు. 

Updated Date - 2021-11-26T09:44:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising