ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదపు అంచున రాయల చెరువు

ABN, First Publish Date - 2021-11-21T22:09:30+05:30

ప్రమాదపు అంచున రాయల చెరువు ఉంది. రాయల చెరువు కట్ట నుంచి స్వల్పంగా వరద లీకవుతోంది. అధికారులు లీకేజీ నివారణ చర్యలు చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: ప్రమాదపు అంచున రాయల చెరువు ఉంది. రాయల చెరువు కట్ట నుంచి స్వల్పంగా వరద లీకవుతోంది. అధికారులు లీకేజీ నివారణ చర్యలు చేపట్టారు. రాయల చెరువు గండి భాగాన్ని ఇసుక బస్తాలతో సిబ్బంది పూడ్చుతున్నారు. రాయల చెరువు మార్గంలో వాహన రాకపోకలు నిలిపివేశారు. చెరువు కట్ట తెగితే వందలాది గ్రామాలు మునిగిపోనున్నాయి. ముళ్లపూడి, పాడిపేట, కుంట్రపాకం, తనపల్లి, పద్మవల్లిపురం, బలిజేపల్లి, గంగిరెడ్డిపల్లి గ్రామాలు ప్రమాదపు అంచున ఉన్నాయి. చెరువు తెగితే శ్రీకాళహస్తి వరకు అనేక గ్రామాలు మునిగిపోనున్నాయి. దీంతో ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.



జిల్లాపై వర్షప్రభావం కొనసాగుతూనే వుంది. చిత్తూరు నీవానదిలో ఉధృతంగా నీళ్లు ప్రవహించడంతో పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లన్నీ ఇప్పటికీ నీళ్లలోనే ఉన్నాయి. ప్రమాదకరంగా ఉన్న సంతపేట లిల్లీ బ్రిడ్జిదారిని అధికారులు మూసివేశారు. నీవానదిలో సగం వరకు నీటి ఉధృతి తగ్గితే తప్ప పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లల్లో నీటిమట్టం తగ్గే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. తిరుపతిలో పలు ప్రాంతాలు ఇంకా వర్షపు నీటిలోనే వున్నాయి. ఓదార్పు, సాయం అందక బాధిత జనం నేతలను, అధికారులను శాపనార్ధాలు పెడుతున్నారు. ఇళ్ళలో నీరు చేరి వస్తువులు, సరుకులన్నీ పాడైనందున తాగునీటికి కూడా అవస్థ పడుతున్నామని వాపోతున్నారు. 

Updated Date - 2021-11-21T22:09:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising