ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాబ్ క్యాలెండర్‌‌పై సీపీఐ నేత రామకృష్ణ ఆగ్రహం

ABN, First Publish Date - 2021-06-22T20:10:04+05:30

నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులతో రామకృష్ణ జూమ్ మీటింగ్ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ప్రభుత్వ విధానాలు, సీఎం జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్‌‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో1.84 లక్షల పోస్టులు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయని, జాబ్ క్యాలెండర్‌లో  10.144 పోస్టులు మాత్రమే విడుదల చేశారని మండిపడ్డారు.


ఎన్నికలకు ముందు 2 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పిస్తామని జగన్ చెప్పిన విషయాన్ని రామకృష్ణ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గద్దెనెక్కిన రెండేళ్లలో 10 వేల పోస్టులతో చేతులు దులుపుకున్నారని విమర్శించారు. గ్రామ వార్డు, సచివాలయాల కాంట్రాక్టు ఉద్యోగాల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా ఎలా లెక్కిస్తారని ప్రశ్నించారు. వాలంటీర్లకు వేతనం పెంచమంటే అవి ఉద్యోగాలు కావు సేవ అని చెప్పారు కాదా అని అన్నారు. ఇప్పుడు 6 లక్షల ఉద్యోగాలలో కలిపి ప్రభుత్వ ఉద్యోగాలుగా ఎలా లెక్కిస్తారని రామకృష్ణ ప్రశ్నించారు.

Updated Date - 2021-06-22T20:10:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising