ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌కు కరోనా నియంత్రణ పట్టదా?: రామకృష్ణ

ABN, First Publish Date - 2021-05-11T09:33:49+05:30

‘‘సీఎం జగన్మోహన్‌రెడ్డికి కక్ష సాధింపు తప్ప కరోనా నియంత్రణ పట్టదా? ఆయన కక్షసాధింపులకై కేటాయించే సమయాన్ని కరోనా నియంత్రణకు కేటాయిస్తే మెరుగైన ఫలితాలుంటాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మే 10(ఆంధ్రజ్యోతి): ‘‘సీఎం జగన్మోహన్‌రెడ్డికి కక్ష సాధింపు తప్ప కరోనా నియంత్రణ పట్టదా? ఆయన కక్షసాధింపులకై కేటాయించే సమయాన్ని కరోనా నియంత్రణకు కేటాయిస్తే మెరుగైన ఫలితాలుంటాయి. మంత్రి సీదిరి అప్పలరాజుపై కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబుపై పెట్టిన కేసులే పెడతారా?’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతిపక్షాలను కలుపుకొని కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాయన్నారు. కనీసం వాళ్లను చూసైనా సీఎం జగన్‌ అఖిలపక్ష సమావేశం నిర్వహించరా? అని నిలదీశారు. కరోనా విపత్తును పక్కనపెట్టి, జగన్‌ ప్రతిపక్షనేతపై అక్రమ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించే వారైతే మంత్రి అప్పలరాజుపై కూడా చంద్రబాబుపై పెట్టిన కేసులే పెట్టగలరా? అని ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి హైదరాబాద్‌ వెళ్లే పేషెంట్ల అంబులెన్సులను తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు నిలిపివేయడం అమానుషం అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ జోక్యం చేసుకొని ప్రజల ప్రాణాలను కాపాడాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-05-11T09:33:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising