ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూతన విద్యా విధానం అసలు లక్ష్యం ఇదే: రామ్‌మాధవ్‌

ABN, First Publish Date - 2021-12-24T02:03:29+05:30

విద్యా రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలు పెంచడమే నూతన విద్యా విధాన లక్ష్యమని బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం: విద్యా రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలు పెంచడమే నూతన విద్యా విధాన లక్ష్యమని బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ అన్నారు. ఏపీ నిట్‌లో గురువారం మదన్‌మోహన్‌ మాలవ్య అకడమిక్‌ కాంప్లెక్స్‌, సెమినార్‌ హాల్‌ను ఆయన ప్రారంభించారు. విద్యా రంగంలో నూతన ఒరవడి-జాతీయ విద్యా విధానంపై రామ్‌మాధవ్‌ ప్రసంగించారు. ప్రపంచంలోని టాప్‌-15 విద్యా సంస్థల్లో  దేశంలోని ఒక్క సంస్థ కూడా లేకపోవడం విచారకరమన్నారు. ప్రపంచ మేటి వంద విద్యా సంస్థల్లోనూ భారత దేశ ప్రభుత్వ విద్యా సంస్థలు లేకపోవడం మరింత విచారించగ్గ విషయమన్నారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని ఇది కించపరచడం కాదన్నారు. దేశీయ సంస్థలతో పోటీ పడడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు పెంచుకునేలా ప్రతి విద్యా సంస్థ ఎదగాలని ఆకాంక్షించారు. కృత్రిమ మేధస్సు, అంతరిక్షంలో ఆస్తుల కోసం పోటీ పడుతున్న నేటి ప్రపంచంలో మనం చాలా వెనుకపడి ఉన్నామని రామ్‌మాధవ్‌ స్పష్టం చేశారు. 

Updated Date - 2021-12-24T02:03:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising