ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ లేఖ

ABN, First Publish Date - 2021-06-13T16:15:21+05:30

ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. ఈసారి రాష్టంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. ఈసారి రాష్టంలో ఉద్యోగ నిమాయకల క్యాలెండర్ పక్రటించకపోవడంతో నిరుద్యోగులు అవస్థ పడుతున్నారంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి రఘురామ లేఖ రాశారు. ఉగాది రోజు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని, మరి ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు. పత్రి ఏడాది  జనవరి 1 నుంచి 30 వరకు ఖాళీ పోస్టులను నింపుతామని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రకటించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.


2019 సెప్టెంబర్‌లో జనవరి 1 నుంచి 30 వరకు నియామకాలు ప్రకటిస్తామని సీఎం జగన్ వెల్లడించారని, జనవరి 2020, 2021 వచ్చిన.. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని రఘురామ విమర్శించారు. గ్రామ, వార్డు కార్యదర్శుల 8402 పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయన్నారు. 6,100 పశువు వైద్య పోస్టులు,18,000 ఉపాధ్యాయులు, 6వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. రాష్ట్ర సచివాలయంలో వందలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.


ఏపీపీఎస్సీ 2018-2019లో చివరగా 3 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిందని, కోర్టు కేసులతో ఇంత వరకు పూర్తి కాలేదని రాఘురామ అన్నారు. ఏపీపీఎస్సీ విడుదల చేసిన ప్రతి నోటిఫికేషన్ చివరికి గందరగోళంగా ఉందని ఆరోపించారు. మెగా డీఎస్సీ ప్రకటిస్తామని అన్నారు..ఇప్పటి వరకు సాధారణ డీఎస్సీ కూడా ప్రకటించలేదని ఎద్దేవా చేశారు. యూనివర్సిటీలో 60 శాతం బోధన సిబ్బంది ఖాళీలు ఉన్నాయని గవర్నర్ ప్రకటించారు. ఏడాది అయిన దాన్ని పట్టించుకోవడం లేదని రఘురామ కృష్ణంరాజు ఆ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2021-06-13T16:15:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising