ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యేసుకు లేని కరోనా గణేశ్‌కు ఏందుకు?: రఘురామ

ABN, First Publish Date - 2021-09-06T20:44:37+05:30

యేసుకు లేని కరోనా గణేశ్‌కు ఏందుకని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఏపీలో వినాయకచవితి జరుపుకోవాలని భావిస్తున్న భక్తులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ వర్థంతి, జయంతి సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించామని, షాపింగ్ మాల్స్ ఒపెన్ చేశారు.. ఇక మద్యం షాపుల దగ్గర రద్దీని చూస్తూనే ఉన్నామన్నారు. మరి యేసుకు లేని కరోనా గణేశ్‌కు ఏందుకని ప్రశ్నించారు. చర్చిల్లో ప్రార్థనలకు అనుమతించారు.. అక్కడ కరోనా రాదా అని అన్నారు. గణేశుడు ఆదిదేవుడని ప్రపంచ దేశాల్లో ఉన్న  హిందువులందరూ ఆరాధించే విఘ్నేశ్వరుని పూజలకు అడ్డంకులు ఏందుకని ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.


విగ్రహాలు ధ్వంసం చేసిన వాళ్ళను పట్టుకోలేక పోయిన వారు.. విగ్రహాలు అమ్మనియకుండ చేస్తారా? అని హిందువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని రఘురామ అన్నారు. మొహర్రం అప్పుడు లేని కరోనా.. ఇప్పుడు వినాయక చవితికి ఎలా వచ్చిందన్నారు. సీఎం బెట్టు వీడి అన్ని మతాల వారిని ఒకేలా చూడాలని సూచించారు. నిబంధనలు పెట్టి పండుగలు చేసుకునేందుకు అనుమతించాలన్నారు.


మూడేళ్లలో బ్రహ్మాండమైన రాజధానిని కడుతానని, రైతులు కళ్ళల్లో ఆనందం చూస్తానని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ అమరావతిలో ప్రసంగించిన విషయాన్ని ఈ సందర్భంగా రఘురామ గుర్తు చేశారు. పెట్రోలు డీజిల్‌పై పన్నుల బాదుడు, మధ్య నిషేధం, రాజధాని సహ అన్నింటిపైన ప్రతిపక్ష నేతగా జగన్ మాట్లాడిన మాటలు అన్నిటికీ అద్దం పట్టే పరిస్ధితులు ఇప్పుడు ఉన్నాయన్నారు. మధ్య నిషేధం కాస్తా మధ్య నిషాధంగా మారిందన్నారు. రాష్టంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారయ్యాయని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.

Updated Date - 2021-09-06T20:44:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising