ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దిక్కుమాలిన దౌర్భాగ్యపు దగుల్బాజీ ట్వీట్‌.. విజయసాయికి రఘురామ కౌంటర్

ABN, First Publish Date - 2021-04-21T20:11:43+05:30

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డిపై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డిపై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా విజయసాయి వివాదాస్పద ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన రఘురామ రాజు... దిక్కుమాలిన దౌర్భాగ్యపు దగుల్బాజీ ట్వీట్‌గా దాన్ని అభివర్ణించారు. ప్రత్యర్థిని అయినా గౌరవించాలని రామాయణం చెబుతోందని, చిన్నప్పటి నుంచి అలాంటి గ్రంథాలు చదువుకుంటే మర్యాద లక్షణాలు వచ్చేవేమో అని వ్యాఖ్యానించారు. 


‘‘నిన్న మీరు చేసిన దరిద్ర ట్వీట్ వలన పార్టీ పరువు పోయింది. పార్టీ ఇమేజ్ పోయింది. జాతీయ కార్యదర్శివి, రాజ్యసభలో సభ్యుడివి... మా అందరికీ పార్లమెంటులో నాయకుడివి. అసలు బుద్ధుందా... అలా మాట్లాడతాడేంటి... ఇదా సంస్కారం’’ అని మండిపడ్డారు. ‘‘సీఎం... నేను విష్ చేశాం కదా. తప్పు సాయి రెడ్డి గారు... మీ సంకుచిత స్వభావాన్ని చూపకండి. ఇలా చెత్త మాట్లాడితే మీకేదో గండపెండేరం తొడుగుతాడని అనుకుంటున్నారేమో... ఇతరులను మీరు గౌరవిస్తే... సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది. మీ దిక్కుమాలిన పోస్టులును సోషల్ మీడియాలో తప్ప... సంస్కారం ఉన్నవాళ్లు ఎవరూ లైక్ చేయరు. దిక్కుమాలిన దౌర్భాగ్యపు దగుల్బాజీ ట్వీట్ల వల్ల తటస్థంగా ఉన్న 15 శాతం ఓటింగ్ పోతుంది. మీ వికృత చర్యల వలన.. ఎవరినైతే మీరు విమర్శించారో అక్కడికే ఆ ఓటింగ్ శాతం పోతుంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే... సీఎం గారు మీరు జాతీయ కార్యదర్శిగా వేరొకరిని నియమిస్తే బాగుంటుంది. ఒకవేళ మీరే చేయించి ఉంటే ఏమీ చేయలేమనుకోండి. ఒకవేళ పార్టీ పరువు గంగలో కలిసి పోతుందని... మీరు భావిస్తే గనుక... కొంచెం సంస్కారం ఉన్న వాళ్లనెవరినైనా.. పెద్దలు ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు లాంటి వారిని నియమించండి’’ అని రఘురామ రాజు వ్యాఖ్యానించారు. 



Updated Date - 2021-04-21T20:11:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising