ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్‌కు రఘురామ మరో లేఖ

ABN, First Publish Date - 2021-06-15T15:04:50+05:30

న్యూఢిల్లీ: ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఆరవ లేఖ సంధించారు. ఉద్యోగులకు డీఏ పెంపు హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉద్యోగులకు బకాయిలు పడ్డ ఏడు డీఏలు వెంటనే అమలు చేయాలని ఆ లేఖలో రాశారు. కరోనా కారణంగా డీఏ పెంపు వాయిదా వేసిన కేంద్రప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తే అది ఉద్యోగుల్లో వ్యతిరేకతకు దారితీస్తుందన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల పీఆర్సీ నివేదిక మరింత ఆలస్యమవుతుందని, పార్టీ అధికారంలోకి రావడానికి మూలస్తంభంగా నిలిచిన ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపుపై వెంటనే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రికి రఘురామ కృష్ణంరాజు ఈ మేరకు లేఖ రాశారు.


కాగా నిన్న అగ్రిగోల్డ్ బాధితులను వెంటనే ఆదుకోవాలని కోరుతూ రఘురామ లేఖ రాశారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా రూ. 11 వందల కోట్లను తక్షణమే విడుదల చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయాలని రఘురామ కోరారు. ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన.. నెరవేరని హామీలను రఘురామ లేఖల ద్వారా  గుర్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-06-15T15:04:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising