ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది: రఘురామ

ABN, First Publish Date - 2021-08-09T19:18:36+05:30

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఎంపీ రఘురామకృష్జంరాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుందని దీనిపై  రాష్ట్రపతి రామనాథ్ కొవింద్‌కు లేఖ రాశానని ఎంపీ రఘురామకృష్జంరాజు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ కూడా క్లారిఫికేషన్ అడిగారన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 142 శాతం బడ్జెట్ అంచనాలకు మించి సర్కార్ అప్పులు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు చూస్తుంటే పరిస్థితి అత్యంత భయంకరంగా ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కులుతుందోనని భయం వేస్తోందన్నారు.


బడ్జెట్ అంచనాలకు మించి రెవెన్యూలోటు, ద్రవ్యలోటు ఉన్నాయని రఘురామ వ్యాఖ్యానించారు. సమీప భవిష్యత్తులోనే ఏపీ అప్పుల ఉబిలో కురుకుపోనుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రం చేస్తున్న అప్పులో 42 శాతం పాత అప్పులపై వడ్డీ చెల్లించడానికే సరిపోతుందన్నారు. జులై రెండో వారం వరకు కూడా ఉద్యోగుల జీతాలు, పెన్షన్‌లు చెల్లించలేదని, ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితి చరిత్రలో ఇంతకు ముందు ఎన్నడూ లేదన్నారు. తక్షణం ఏపీలో కేంద్రం ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించాలని ఆ లేఖలో రాష్ట్రపతిని పేర్కొన్నట్లు ఎంపీ రఘురామ కృష్ణంరాజు చెప్పారు.

Updated Date - 2021-08-09T19:18:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising