ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్‌పైనే రఘురామరాజుకు ఎంతకంత కోపం?

ABN, First Publish Date - 2021-04-09T02:17:21+05:30

సీఎం జగన్‌పైనే రఘురామరాజుకు ఎంతకంత కోపం?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తిరుపతిలో ఉపఎన్నిక ప్రచారం పుంజుకుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మూడు రోజులుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గురువారం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. బీజేపీ అభ్యర్థి రత్న‌ప్రభ తరపున జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ర్యాలీ, సభ నిర్వహించారు. బీజేపీ నాయకులు కూడా ప్రచారం చేస్తున్నారు. తిరుపతి స్థానాన్ని నిలబెట్టుకునేందుకు వైసీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో కొత్త కొత్త అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. తిరుపతిలో ఓ ఆశ్రమానికి సంబంధించి రూ.30 కోట్ల స్కాంతో పాటు రిటైర్ అర్చకుడు రమణ దీక్షితులను మళ్లీ ప్రధాన అర్చకుడిగా నియమించడం. రమణ దీక్షితులు.. సీఎం జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చడం వంటి అంశాలు తిరుపతి ఉపఎన్నికపై ప్రభావం చూపుతున్నాయి. వీటితో పాటు వివేకానందరెడ్డి హత్యపై ఆయన కుమార్తె ఢిల్లీ వెళ్లి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం జగన్‌పై అనుమానం, అసంతృప్తి వ్యక్తం చేయడం పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. మరోవైపు వివేకానందరెడ్డి హత్య అంశం తిరుపతి ఉపఎన్నికలో విపక్షాలకు ప్రచార అస్త్రంగా మారింది. సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌ సరిగాలేదని కోర్టు  రిటర్న్ చేసింది.  ఇక జగన్ బెయిల్ రద్దు అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపింది. 


ఈ నేపథ్యంలో ‘‘పార్టీ అధినేతపైనే రఘురామకృష్ణంరాజుకు ఎందుకంత కోపం?. అసలు జగన్‌కు రఘురామకృష్ణంరాజుకు ఎక్కడ తేడా వచ్చింది?. జగన్ బెయిల్ క్యాన్సిల్ చేయాలనే స్థాయికి రఘురామకృష్ణంరాజు ఎందుకు వెళ్లారు?. రఘురామరాజును చంపేందుకు నిజంగానే కుట్ర జరుగుతోందా?. అంతలా తిరుబాటు చేస్తున్న వ్యక్తిని జగన్ ఎందుకు భరిస్తున్నారు.’’ అనే అంశాలపై  వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎక్స్లూజివ్ లైవ్ షో నిర్వహంచింది. ఈ లైవ్ షో వీడియోను చూడగరు. 


Updated Date - 2021-04-09T02:17:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising