ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా పార్టీ నేతలు సీఎంను రాజీనామా అడుగుతారేమో..: రఘురామకృష్ణరాజు

ABN, First Publish Date - 2021-03-25T20:41:41+05:30

పలువురు వేసిన ముళ్ల కంచె దాటి ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: పలువురు వేసిన ముళ్ల కంచె దాటి ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ని అడ్డంకులెదురైనా ఎన్వీ రమణ ఏప్రిల్ 24న ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అక్టోబర్ 26న చేసిన అభియోగాలు నిరాధారమని చెప్పారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి బాబ్డే ఆ అభియోగాలు తోసిపుచ్చారని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.  ‘‘హైకోర్టు సింగిల్ జడ్జి బెంచి నిమ్మగడ్డకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే రాజీనామా చేయాలన్న మా పార్టీ మంత్రులు..  సుప్రీంకోర్టులో ప్రస్తుతం సీఎంకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది కాబట్టి..  మా పార్టీ నేతలు సీఎంను రాజీనామా అడుగుతారేమో అన్న భయం పట్టుకుందన్నారు.  నేను సీబీఐ విచారణ నుంచి తప్పుకుంటున్నానని మా పార్టీ నేతలు మాట్లాడుతున్నారని చెప్పారు.  ప్రతీ శుక్రవారం ఏదో కార్యక్రమం పెట్టుకుని సీబీఐ విచారణకు వెళ్లకుండా ఉంటున్న మా సీఎంను.. మా ఎంపీలే పరోక్షంగా నా పేరుమీద ఆయనను విమర్శిస్తున్నారనే బాధకలుగుతుంది’’ అని రఘురామకృష్ణరాజు చెప్పారు.


రాష్టంలో 5 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక డిమాండ్ ఉండగా.. కేవలం 2 కోట్ల డిమాండ్ చూపించి, మిగతా 3 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుకను ప్రైవేటుగా అమ్మకునేలా పని చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి చెందిన ఓ వ్యక్తి నుంచి గంగవరం పోర్టును గుజరాత్ కంపెనీకి అమ్ముకుంటే బాధగా ఉందన్నారు.  అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఏపీని ఎలా బయటకు తీసుకు వస్తారు? అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. అదాని, అంబానీలకు రాష్ట్రాన్ని అప్పగిస్తారేమోనన్న అనుమానం కలుగుతుందని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

Updated Date - 2021-03-25T20:41:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising