ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాక్షి వార్త నిజమని తేలింది: రఘురామ

ABN, First Publish Date - 2021-09-15T21:00:33+05:30

చివరికి తన పిటిషన్‌ను సీబీఐ కోర్టు డిస్మిస్ చేసిందని ఎంపీ రఘురామకృష్ణారాజు తెలిపారు. సాక్షి దినపత్రిక వార్త నిజమని తేలిందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: చివరికి తన పిటిషన్‌ను సీబీఐ కోర్టు డిస్మిస్ చేసిందని ఎంపీ రఘురామకృష్ణారాజు తెలిపారు. సాక్షి దినపత్రిక వార్త నిజమని తేలిందన్నారు. సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుపై ఉన్నత న్యాయస్థానాన్ని సంప్రదిస్తానని ఆయన ప్రకటించారు. త్వరలో హైకోర్టుకు వెళ్తానని, హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తానని రఘురామ స్పష్టం చేశారు.


జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్‌ రద్దు పిటిషన్‌ను వేరే బెంచ్‌కు మార్చాలని రఘురామ తెలంగాణ హైకోర్టును కోరారు. అయితే ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అయితే ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు.. జగన్‌, విజయసాయి బెయిల్‌ రద్దు పిటిషన్ల బదిలీకి నిరాకరించింది. రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టులో రఘరామ వేసిన పిటిషన్‌ను కొట్టివేశారు. అయితే రఘురామ దాఖలుచేసిన ఈ పిటిషన్‌పై జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి. తీర్పును అప్పటినుంచి కోర్టు రిజర్వు చేసింది. నేడు జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. దీంతో జగన్‌, విజయసాయికి ఊరట లభించింది.

Updated Date - 2021-09-15T21:00:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising