ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచ్ ప్రభాకర్‌కు ఢిల్లీ పోలీసుల పంచ్

ABN, First Publish Date - 2021-08-17T21:48:29+05:30

పంచ్ ప్రభాకర్‌కు ఢిల్లీ పోలీసుల నుంచి పంచ్ పడింది. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: పంచ్ ప్రభాకర్‌కు ఢిల్లీ పోలీసుల నుంచి పంచ్ పడింది. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. స్థానిక కోర్టు అనుమతి తీసుకుని పంచ్ ప్రభాకర్‌పై ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. యూట్యూబ్ సంస్థకు కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పంచ్ ప్రభాకర్‌ అమెరికాలో ఉంటూ వైసీపీని వ్యతిరేకించిన వారిపై యూట్యూబ్‌లో అసభ్య పదజాలంతో వీడియోలను పోస్ట్‌ చేస్తున్నారు. పంచ్ ప్రభాకర్ వీడియోల పూర్తి సమాచారం అందించాలని పోలీసులు ఆదేశించారు. ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్, ఎంపీ రఘురామకృష్ణరాజు సహా.. పలువురు ప్రముఖులపై పంచ్ ప్రభాకర్‌ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ యూట్యూబ్‌లో వీడియోలు పోస్టు చేసేవారు. ఈ వ్యవహారంలో ప్రభాకర్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తదుపరి విచారణ కొనసాగుతుందని ఢిల్లీ పోలీసులు స్థానిక కోర్టుకు తెలిపారు. 

Updated Date - 2021-08-17T21:48:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising