ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడలో దడ పుట్టిస్తున్న సైకో

ABN, First Publish Date - 2021-06-29T23:08:48+05:30

నగరంలోని పటమట పోలీస్’స్టేషన్ పరిధిలోని అయ్యప్ప నగర్, అశోక్‌నగర్లలో ఓ సైకో దడ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 విజయవాడ: నగరంలోని పటమట పోలీస్’స్టేషన్ పరిధిలోని అయ్యప్ప నగర్, అశోక్‌నగర్లలో ఓ సైకో దడ పుట్టిస్తున్నాడు. సంవత్సరన్నర నుంచి బెజవాడ వాసులకు ఆ సైకో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. సైకో వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. మహిళలే టార్గెట్‌గా అర్ధరాత్రి ఇళ్ళలోకి చొరబడుతున్న ఆ సైకో వ్యక్తి ఎవరనేది అంతుబట్టని అంశంగా మారింది. ఇళ్ళలో దూరి, కిటికీ చాటున, బాత్‌రూంల మాటున నక్కి మహిళలు, యువతుల శరీర భాగాలను చూస్తూ ఆ సైకో పైశాచిక ఆనందం పొందుతున్నాడు.


 సంవత్సరన్నర నుంచి పోలీసులకు చిక్కకుండా సైకో తప్పించుకు తిరుగుతున్నాడు. నల్ల ప్యాంట్, నల్ల షర్ట్ ధరించి ముఖం కనిపించకుండా మంకీ క్యాప్ పెట్టుకుంటున్నాడు. స్థానికులు పట్టుకోవాలని చూసినా ఆ సైకో చిక్కడం లేదు. ఎవరైనా పట్టుకోడానికి ప్రయత్నిస్తే దొరక్కుండా జారి పోయేందుకు ఒంటిపై ఆయిల్ రాసుకుని అదృశ్యమవుతున్నాడు. సైకో నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. 

Updated Date - 2021-06-29T23:08:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising