ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూన్ 29న ఆందోళన కార్యక్రమాలు: చంద్రబాబు

ABN, First Publish Date - 2021-06-22T21:14:44+05:30

సంక్షేమం పేరుతో ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రజలను మోసగిస్తున్నారని... ప్రజలకు జగన్ సర్కారు ఇచ్చింది గోరంత... దోచింది కొండంత అని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సంక్షేమం పేరుతో ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రజలను మోసగిస్తున్నారని... ప్రజలకు జగన్ సర్కారు ఇచ్చింది గోరంత... దోచింది కొండంత అని టీడీపి ఆధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. మంగళవారం నాడు నియోజకవర్గ ఇంఛార్జిలు, ముఖ్య నేతలతో జరిగిన సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి అవినీతిపై క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తామన్నారు. ఈ నెల 29వ తేదీన 175 నియోజకవర్గాల్లో టీడీపీ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్‌లో ఏపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న చంద్రబాబు.... వారం రోజులు టీకాలు వేయకుండా ఒక్కరోజు మాత్రమే టీకాలు వేసి ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఏపీలో కరోనా మరణాలు ప్రభుత్వ లెక్కలకంటే 14 రెట్లు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారని అన్నారు. జాబ్ కేలండర్ పై నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్న టీడీపీ అధినేత ఉద్యోగ, ఉపాధి కల్పనలో రాష్ట్ర పరిస్థితి దయనీయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.


ఇక వ్యవసాయం పరిస్థితి చూస్తే రైతులకు ఏపీ సర్కారు ధాన్యం బకాయిలు చెల్లించలేదని, పంటలకు గిట్టుబాటు ధర లేదని చంద్రబాబు మండిపడ్డారు. తమిళనాడులో సమర్థులైన, నోబుల్ గ్రహీతలైన వారిని సలహాదారులగా పెట్టుకుంటే... ఏపీలో మాత్రం అసమర్థులను సలహాదారులుగా పెట్టుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో ఎక్కడ చూసినా రేప్‌లు, సెటిల్మెంట్లు, ఫ్యాక్షన్ హత్యలు, గంజాయి స్మగ్లింగ్ రాజ్యమేలుతున్నాయన్నారు. జగన్ రెడ్డి ఇంటి సమీపంలోనే యువతిపై దారుణ అత్యాచారం జరగడం శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమనన్నారు.


ఏపీలో చేయూత పేరుతో మోసం జరుగుతోందన్న చంద్రబాబు... 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు రూ.3 వేలు పెన్షన్ ఇస్తామనే హామీ ఏమైందని ప్రశ్నించారు. ఏడాదికి రూ.36వేలు చొప్పున ఐదేళ్లలో ఒక్కో మహిళకు రూ.1,80,000 చెల్లించాల్సి ఉండగా లబ్ధిదారుల ఎంపికలో పెద్ద ఎత్తున కోత విధించారన్నారు. దీనిని 4 ఏళ్లకు మాత్రమే పరిమితం చేసి.. కొంతమందికి మాత్రమే ఏడాదికి రూ.18వేలు చెల్లింపు జరుగుతోందని, ఇలా ఒక్కో మహిళకు రూ.లక్షా 5వేలు ఎగనామం పెట్టి వంచించారని వివరించారు. డ్వాక్రా మహిళలకు కూడా రుణమాఫీ చేస్తానని జగన్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.

Updated Date - 2021-06-22T21:14:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising