ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిమ్మగడ్డపై చర్యలకు ఉపక్రమించిన ప్రివిలేజ్ కమిటీ

ABN, First Publish Date - 2021-03-18T00:03:31+05:30

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ చర్యలకు ఉపక్రమించింది. ప్రివిలేజ్ కమిటీ భేటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించనుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ చర్యలకు ఉపక్రమించింది. ప్రివిలేజ్ కమిటీ భేటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించనుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన నోటీసులపై కాకాణి గోవర్థన్‌ కమిటీ దృష్టి సారించనుంది. ఎస్ఈసీని వివరణ అడిగే దిశగా కమిటీ చర్చించే అవకాశం ఉంది. నిమ్మగడ్డపై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఇచ్చిన హక్కుల ఉల్లంఘన నోటీసును అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీకి సభాపతి తమ్మినేని సీతారాం పంపారు. గవర్నర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో తమను కించపరచేలా, ప్రతిష్ఠను దిగజార్చేలా ఎస్‌ఈసీ పేర్కొన్నారని, ఈ ఫిర్యాదులోని అంశాలపై సామాజిక మాధ్యమాలు తమ వ్యక్తిత్వాన్ని కించపరచేలా ప్రసారం చేశాయని స్పీకర్‌కు మంత్రులు ఫిర్యాదు చేశారు.


గతంలో ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో ప్రివిలేజ్‌ కమిటీ సమావేశం అయింది. ఎస్‌ఈసీపై మంత్రులు ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్‌పై ప్రధానంగా చర్చించారు. అసెంబ్లీలోని రూల్‌ నెం 212, 213 కింద ఎస్‌ఈసీని పిలింపించవచ్చని సభ్యులు తెలిపారు. గతంలో మహారాష్ట్రలో కూడా ఇలానే చేశారని ప్రివిలేజ్‌ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఆర్టికల్‌ 243 ప్రకారం ఎస్‌ఈసీకి సర్వాధికారాలు ఉన్నాయని, అలాంటప్పుడు ఎలా పిలిపిస్తారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. మరో వారంలో ఆన్‌లైన్‌లో కాకుండా నేరుగా సమావేశం కావాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఎస్‌ఈసీ అంశం కావడంతో విస్తృతంగా చర్చించాలని ప్రివిలేజ్‌ కమిటీ నిర్ణయించింది. అయితే తిరిగి ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రివిలేజ్‌ కమిటీ సమావేశం కానుంది.

Updated Date - 2021-03-18T00:03:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising