ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడలో కొత్త తరహా మోసం

ABN, First Publish Date - 2021-03-04T21:13:58+05:30

విజయవాడ: నగరంలో ఓ కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: నగరంలో ఓ కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలనుకున్న ఓ యువ రైతును వైట్ కాలర్ నేరగాళ్లు నిలువునా మోసం చేశారు. బ్యాంక్ నుంచి వ్యవసాయ రుణం మంజూరు చేయిస్తామని నమ్మబలికి లక్షలు దండుకున్నారు. లోన్ ప్రొసెసింగ్ ఫీజులు, స్టాంప్ డ్యూటీలు, ఇన్సురెన్స్ చార్జీలతోపాటు కమిషన్ల పేరుతో రూ. 5 లక్షలకు కుచ్చుటోపీ పెట్టారు.


రుణం మంజూరు పేరిట నెలల తరబడి నాటకాలాడుతూ వచ్చిన మోసగాళ్లు.. ‘‘మాకు మీ లోను వద్దు మహాప్రభో.. ఇచ్చిన డబ్బులు, ఆస్తి పత్రాలు తిరిగి ఇచ్చేయమని లబోదిబో మన్నబాధితుడికి చుక్కలు చూపిస్తున్నారు. మీ లోన్ హోల్డులో ఉంది.. ఇప్పుడు వద్దంటే నువ్వు ఇచ్చిన డబ్బు ఒక్క రూపాయి కూడా వెనక్కిరాదని, నీ ఆస్తి పత్రాలు నీకివ్వాలంటే మరో రూ. 2 లక్షలు ఇవ్వాలంటూ వేధింపులకు దిగారు’’. సాగువైపు ఆసక్తి పెంచుకున్న ఓ యువకుడికి రుణం పేరుతో ఓ ప్రైవేటు బ్యాంక్ టోకరా వేసింది. రూ. 4 కోట్ల వ్యవసాయ రుణం మంజూరు చేస్తామని చెప్పి.. రూ. 5లక్షలు వసూలు చేసి మోసం చేసింది. దీనిపై బాధితులు కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-03-04T21:13:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising