ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రుల నేతృత్వంలోనే దొంగ కార్డుల ముద్రణ

ABN, First Publish Date - 2021-04-19T09:48:54+05:30

‘‘తిరుపతి ఉప ఎన్నికలో రాష్ట్ర మంత్రుల నేతృత్వంలోనే దొంగ ఓటర్‌ కార్డుల ముద్రణ జరిగింది. మంత్రుల నియోజకవర్గాల్లోనే లక్షల సంఖ్యలో దొంగ కార్డులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెనక్కు పంపిన 250 బస్సులు ఎవరివి? ఎక్కడివి!: యనమల


అమరావతి, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): ‘‘తిరుపతి ఉప ఎన్నికలో రాష్ట్ర మంత్రుల నేతృత్వంలోనే దొంగ ఓటర్‌ కార్డుల ముద్రణ జరిగింది. మంత్రుల నియోజకవర్గాల్లోనే లక్షల సంఖ్యలో దొంగ కార్డులు ముద్రించారని ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్‌ దీనిపై లోతుగా దర్యాప్తు జరిపాలి. దొంగ ఓట్ల వ్యవహారాన్ని బట్టబయలు చేయాలి’’ అని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన చేశారు. దొంగ ఓట్లతో తమ పాలనపై వ్యతిరేకతను కప్పిపెట్టాలని జగన్‌ రెడ్డి ప్రయత్నించారని ఆరోపించారు.


ప్రభుత్వ యంత్రాంగం పాత్ర లేకుండా ఇంత భారీగా ఈ వ్యవహారం నడవదన్నారు. ‘‘250 బస్సులు వెనక్కు పంపామని డీజీపీ చెబుతున్నారు. ఆ బస్సులు ఎవరివి? ఎక్కడ నుంచి వచ్చాయి? వాటిలో ఉన్నదెవరు? తదితర విషయాలపై ఎందుకు దర్యాప్తు చేయలేదు? దొంగ ఓట్లు వేయడానికి వస్తుంటే వారిని అరెస్టు చేయాల్సిన అవసరం లేదా? దొంగ ఓట్లు వేస్తున్న 12 మందిని అరెస్టు చేశామని కూడా డీజీపీ చెప్పారు. వారంతా వైసీపీకి చెందిన వారే. ఆ విషయం మాత్రం ఆయన చెప్పలేదు’’ అని విమర్శించారు.

Updated Date - 2021-04-19T09:48:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising