వైఎస్సార్‌కు ఘన నివాళి
ABN, First Publish Date - 2021-07-09T05:03:22+05:30
చిరస్మరణీయుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు.
మార్కాపురం, జులై 8: చిరస్మరణీయుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా స్థానిక గడియార స్తంభం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహానికి ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ చిల్లంచెర్ల బాలబమురళీకృష్ణ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తూర్పు వీధిలో ఏ ర్పాటు చేసిన వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమాల్లో వైస్ చైర్మన్ షేక్ ఇస్మాయిల్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీర్జా షంషీర్ అలీబేగ్, ఏఎంసీ చైర్మన్ గుంటక కృష్ణవేణి, వైస్ చైర్మన్ బొగ్గరపు శేషారావు, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల కొండయ్య, కౌన్సిలర్లు డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ, కొత్తా కృష్ణ, నాగేశ్వరరావు, మొఘల్ షిరాజ్ బేగ్, దారివేముల హర్షిత, ముంగమూరి శ్రీను, వైసీపీ నా యకులు పెరుమాళ్ల కాశీరావు, గుంటక వెంకటరెడ్డి, మారంరెడ్డి రామకృష్ణారెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు గుంటక సుబ్బారెడ్డి, పంబి వెంకటరెడ్డి, మహేశ్వరరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పొదిలిలో..
పొదిలి : వైఎస్ జయంతి సందర్భంగా ఆ యన విగ్రహాలకు ఎమ్మెల్యే కుందురు నాగా ర్జునరెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. చిన్నబస్టాండ్‌లో రెడ్డి జేఏసీ డాక్టర్స్ విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి యర్రం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. కార్య క్రమంలో ఆర్‌ఎంపీల వైద్యుల సంఘ అధ్య క్షుడు వై.వెంకటరెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, ఏఎంసీ చైర్మన్ జి.కోటేశ్వరి శ్రీనివా్‌స, జిల్లా కార్యదర్శి గొలమారి చెన్నారెడ్డి పాల్గొన్నారు.
తర్లుపాడులో..
తర్లుపాడు : తర్లుపాడు బస్టాండ్ సెంటర్‌లోని వైఎస్ విగ్ర హానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంత రం పేదలకు పండ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో సర్పంచ్ పల్లెపోగు వరాలు, మాజీ సర్పంచ్ సూరెడ్డి రామసుబ్బారెడ్డి, ఉప సర్పంచ్ వెన్నా సత్యనారాయణరెడ్డి, మాజీ ఎంపీటీసీ షేక్ అక్బర్ వలి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
గిద్దలూరులో..
గిద్దలూర : వైఎస్ జయంతి సందర్భంగా స్థానిక రాచర్లగేటు సెంటర్ వద్ద వైఎస్ విగ్ర హానికి ఎమ్మెల్యే అన్నా రాంబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పా ర్టీ కార్యాలయం ఎదుట వైసీపీ జెండాను ఎగురవేసి మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాలలో మున్సిపల్ చైర్మన్ పాముల వెంకటసుబ్బ య్య, వైస్‌చైర్మన్ ఆర్‌డీ రామకృష్ణ, మార్కెట్‌కమిటీ చైర్మన్ మెహతాబ్, నాయకులు డాక్టర్ భూమా నరసింహారెడ్డి, కడప వంశీధర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, కంచర్ల కోటయ్యగౌడ్, రెడ్డి భాస్కర్‌రెడ్డి, బీవీ కృష్ణారెడ్డి పలువురు మున్సిపల్ కౌ న్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. అలాగే బేస్తవారపేటలోని ఆర్కెనగర్ జంక్షన్‌లో జరిగి న జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే రాంబాబు పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేశారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.
రాచర్లలో..
రాచర్ల : మండలంలోని అన్ని గ్రామాలలో వైఎస్ జయంతిని నిర్వహించారు. జడ్పీటీసీ స భ్యులు పగడాల శ్రీరంగం, వైసీపీ నాయకులు మురళి, సూరా పాండురంగారెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు వైఎస్ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించారు.
కొమరోలులో..
కొమరోలు : మండలంలో వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సర్పం చ్ దండు శశికళ, జడ్పీటీసీ సారె వెంకటనాయుడు, ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి, చిన్నసుబ్బరాయుడు, రమణయ్య, సుబ్రమణ్యం, పంచాయతీ కార్యదర్శి రమణయ్య పాల్గొన్నారు.
వై.పాలెంలో..
ఎర్రగొండపాలెం : గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో వైఎస్ జయంతి కా ర్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాన సెంటరులో వైఎస్ వ్రిగహానికి ఏఎంసీ చై ర్మన్ ఒంగోలు మూర్తిరెడ్డి పూలమా ల వేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో మండల కన్వీనర్ కిరణ్‌గౌడ్, పీడీసీసీబీ డైరెక్టర్ బాలగురవయ్య, మాజీ ఎంపీపీ చేదూరి విజయభాస్కర్, నవోదయపాఠశాల కమిటీ డైరెక్టర్ గురుప్రసాద్, శ్రీశైలం ట్రస్టు బోర్డు మాజీ సభ్యులు వెంకటసుబ్బారావు, స ర్పంచ్ ఆర్.అరుణాబాయ్, వాసవీసేవాదళ్ రా ష్ట్ర చైర్మన్ యిమ్మడిశెట్టి సత్యనారాయణ తదిత రులు పాల్గొన్నారు. అనంతరం ఆనందయ్య మందును పంపిణీ చేశారు.
త్రిపురాంతకంలో..
త్రిపురాంతకం : మండల కేంద్రంలో రెండు వర్గాలు ఉండగా మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి ఆధ్వర్యంలో త్రిపురాంతకంలో వైఎస్ జయంతిని నిర్వహించారు. అలాగే మండల పార్టీ అధ్యక్షుడు పి.చంద్రమౌళిరెడ్డి, ఆధ్వ ర్యం లో నాయకులు గోపాల్‌రెడ్డి, ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి పంచాయితీ కార్యాలయంలో నిర్వహిం చా రు. కార్యక్రమంలో సర్పంచ్ పి.వెంకటలక్ష్మి, నా యకులు ఎస్.సుబ్బారావు, బి.సుబ్బారావు, ఎన్.త్రిపురారెడ్డి, పి.మల్లికార్జున పాల్గొన్నారు.
పుల్లలచెరువులో..
పుల్లలచెరువు : మండలంలో వైసీపీ నాయకులు వైఎస్‌గ్రహానికి పూలమాలవేసి ని వాళులర్పించారు. చాపలమడుగు సర్పంచి స త్యనారాయణరెడ్డి, కవలకుంట్ల సర్పంచి లక్ష్మిదేవి వైఎస్ చిత్రపటాలకు పూలమాలలు వేశారు.
పెద్దదోర్నాలలో..
పెద్ద దోర్నాల : వైసీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ అబ్దుల్ మజీద్, మాజీ జడ్‌పీటీసీ సభ్యుడు అమిరెడ్డి రామిరెడ్డి ఆధ్వర్యంలో నటరాజ్ సెంటర్‌లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తహసీల్దారు వేణుగోపాల్ ఆనందయ్య మందును పం పిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచి చిత్తూరి హారిక, నాయకులు గురవారెడ్డి, కాసా రఘునాధరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2021-07-09T05:03:22+05:30 IST