ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YSRCP నేతల రహస్య సమావేశం.. ఒక పత్రికకే ఆహ్వానం.. కారణం అదేనా..!?

ABN, First Publish Date - 2021-09-30T05:00:52+05:30

వైసీపీ నేతలు, అధికారులు కలిసి రహస్య సమావేశాన్ని నిర్వహించడంపై....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మండల పరిషత్‌ కార్యాలయం పనివేళలు ముగిశాక భేటి
  • నాయకుల మధ్య సమన్వయలోపం, జగనన్నపల్లెబాటలో వచ్చిన సమస్యలు బయటపడతాయనే భయమే కారణమా?
  • కేవలం ఒక పత్రికకు మాత్రమే అధికారుల ఆహ్వానం


సింగరాయకొండ, సెప్టెంబరు 29 : మండల పరిషత్‌ కార్యాలయంలో వైసీపీ నేతలు, అధికారులు కలిసి రహస్య సమావేశాన్ని నిర్వహించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమావేశం కార్యాలయం పనివేళలు ముగిసిన తరువాత కూడా కొనసాగించడం గమనార్హం. వివరాల్లోకి వెళ్లితే.. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో వైసీపీ నియోజవర్గ, మండల స్థాయి నాయకులు ఇటీవల మండలంలో జరిగిన జగనన్న పల్లెబాటలో వచ్చిన సమస్యల పరిష్కారానికి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మండల, గ్రామ స్థాయి అధికారులు అందరూ హాజరయ్యారు. ప్రభుత్వ కార్యాలయంలో జరుగుతున్న సమావేశానికి ఒక పత్రికకు మాత్రమే సమాచారం ఇచ్చి మిగతా వాటికి సమాచారం ఇవ్వలేదు.


అధికారపార్టీలో నాయకుల మధ్య ఉన్న సమన్వయం లోపం, జగనన్న పల్లెబాటలోని ఉన్న సమస్యలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే గుట్టుగా సమావేశాన్ని నిర్వహించినట్లు సమాచారం. అందువల్లే వైసీపీ నాయకులు జారీ చేసిన హుకుంతోనే అధికారులు మీడియా మొత్తానికి సమాచారం ఇవ్వలేదని చెబుతున్నారు. ఈ సమావేశంలో వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మాదాసి వెంకయ్య, ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ వైద్యవిభాగం అధ్యక్షుడు డాక్టర్‌ బత్తుల అశోక్‌కుమార్‌రెడ్డి, ఎంపీపీ కట్టా శోభారాణి, వైసీపీ నేతలు యన్నాబత్తిన వెంకటేశ్వరరావు (చిన్నా), సామంతుల రవికుమార్‌రెడ్డి, షేక్‌ పటేల్‌, ధన్యాసి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-30T05:00:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising