ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నదాతకు తప్పని కష్టాలు

ABN, First Publish Date - 2021-11-06T05:01:52+05:30

అన్నదాతలకు సాగు కష్టాలు తప్పడం లేదు.

కారంచేడు ప్రాంతంలో నీటమునిగిన మిర్చి పైరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారీ వర్షాలతో  దెబ్బతిన్న మిర్చి, వైట్‌బర్లీ

ప్రారంభంలోనే నష్టాలు 

పెరుగుతున్న పెట్టుబడులు

పర్చూరు, నవంబరు 5: అన్నదాతలకు సాగు కష్టాలు తప్పడం లేదు. ఏటికేడు వ్య వసాయ ఖర్చులు పెరిగిపోవటం, వాతావర ణ పరిస్థితులు అనుకూలించక పోవటంతో ఆందోళన చెందుతున్నారు. ఈఏడాది వ్యవసాయ ప్రారంభంలోనే వాతావరణ పరిస్థితులు అనుకూ లించకపోవటంతో సాగు ఆలస్యంగా సాగింది. దీనికి ప్రధాన కారణం గత ఏడాది సాగుచేసిన మిర్చి, శ నగ పంటకు సరైన మద్దతు ధర లేకపోవటంతో కోల్ట్‌ స్టోరేజీల్లో నిల్వ చేశారు. దీనికితోడు ప్రకృతి అనుకూలించకపోవటంతో ఈ ఏడాది సాగు ఆల స్యంగా ప్రారంభమైంది. ఖరీఫ్‌లో సాగు నామమా త్రంగానే సాగింది. ఇక రబీపైనే రైతులు ఆశలు పె ట్టుకున్నారు. గత నెలరోజుల నుంచి మిర్చి, వైట్‌బర్లీ మొక్కలు నాటుతున్నారు. అయితే, గత వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు రైతులు కలవరానికి గురిచేశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో మిర్చి, వైట్‌బర్లీ పొగాకు పైర్లలో నీరు చేరటంతో మొక్కలు ఉరకెత్తా యి. పంట పొలాల్లో ఉన్న వర్షపు నీటిని బ యటకు పంపేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.

పర్చూరు వ్యవసాయ సబ్‌డివిజన్‌ పరిఽధిలో ని పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, యద్దన పూడి మండలాల్లో అధిక శాతం రైతులు మిర్చి, వైట్‌బర్లీ పొగాకు సాగు చేస్తున్నా రు. ఇప్పటికే మిర్చికి ఎకరానికి రూ.50 వేల వరకు ఖర్చుచేసినట్టు రైతులు తెలి పారు. ఉరకెత్తిన మొక్కలను తొలగించి తిరిగి సాగుచేయాలంటే అదనంగా భా రం పడుతుందని రైతులు ఆవేదన వ్య క్తం చెందుతున్నారు. వైట్‌బర్లీ పొగాకుకు ప్రస్తుతం ఎకరానికి రూ.20 నుంచి రూ. 25వేల వరకు సాగుకు ఖర్చుచేశారు. ప్రస్తుతం అధిక శాతం పొలాల్లో పైర్లు ఉరకెత్తి ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.


Updated Date - 2021-11-06T05:01:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising