ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాభివృద్ధికి సర్పంచులు పాటుపడాలి : డీపీవో

ABN, First Publish Date - 2021-07-28T06:10:34+05:30

గ్రామ స ర్పంచ్‌గా ఎన్నికైన ప్రజాప్రతినిధులు పా ర్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధే ధ్యేయం గా పని చేయాలని జిల్లా పంచాయతీ అధికారి కేవీ నారాయణరెడ్డి అన్నారు.

డీపీవోకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న మహేశ్వరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముండ్లమూరు, జూలై 27 : గ్రామ స ర్పంచ్‌గా ఎన్నికైన ప్రజాప్రతినిధులు పా ర్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధే ధ్యేయం గా పని చేయాలని జిల్లా పంచాయతీ అధికారి కేవీ నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని శంకరాపు రం, పసుపుగల్లు, నాయుడుపాలెం, కెల్లంపల్లి, ఈదర సర్పంచ్‌లు ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా డీపీవో నారాయణరెడ్డి మాట్లాడుతూ పంచాయతీలో ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేస్తూ గ్రామంలో ప్రధానంగా అభివృద్ధి పనులు చేయాలన్నారు. పారిశుధ్యం లోపించకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు వరగాని బాలసుందరరావు, జమ్ముల గురవయ్య, గొర్రె శ్రీదేవి రాముడు, వంగల పద్మావతి శ్రీనివాసరెడ్డి, కూరపాటి మహేశ్వరి నారాయణస్వామి తదితరులు ఉన్నారు. 

పంచాయతీ సేవలపై అవగాహన

తాళ్లూరు : పంచాయతీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తాళ్లూరు సర్పంచ్‌ మేకల చార్లెస్‌ సర్జన్‌ అన్నారు. స్థానిక తాళ్లూరు-1 సచివాలయం వద్ద మంగళవారం ‘మేరా పంచాయతీ-మేరా అధికార్‌’ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ సేవలపై అవగాహనసదస్సు నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. సచివాల యాల ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందుబాటులో ఉంటున్నా యన్నారు. 64 రకాల డిజిటల్‌ సేవలు నిర్ణీత కాలవ్యవధిలో అందించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామకార్యదర్శి ప్రసన్నకుమార్‌. తాళ్లూరు-2 గ్రామకార్యదర్శి ఎ.చిరంజీవి, సచివాలయసిబ్బంది, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-28T06:10:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising